Tuesday, April 30, 2024

దూరాలను తగ్గించే అటల్ సీ బ్రిడ్జి..

- Advertisement -
- Advertisement -

ముంబై : దేశంలోని అతి పొడవైన సముద్రపు వంతెన అటల్ సేతువు ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్(ఎంటిహెచ్‌ఎల్)ను ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం రాకపోకలకు ఆరంభించారు. ముంబై నవీ ముంబైలను కలిపే ఈ ఆరు లైన్ల సీబ్రిడ్జి 21.8 కిలోమీటర్ల పొడవు ఉంది. సముద్రంపై 16.5 కిలోమీటర్ల మేర విస్తరించుకుని ఉంది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పేరిట వెలిసిన ఈ సీ బ్రిడ్జికి నిర్మాణ వ్యయం రూ 17,840 కోట్లు. సుదీర్ఘ దూరం విస్తరించుకుంటూ సాగే ఈ వంతెన ఆద్యంతం రంగురంగుల విద్యద్దీపాల కాంతులతో కనులపండువగా ఉండగా ప్రధాని రిబ్బన్ కట్ చేసి ఆవిష్కరించారు. ఈ సీ బ్రిడ్జిని అటల్ బిహారీ వాజ్‌పేయి సేవ్రీ న్యావా షేవా అటల్ సేతుగా వ్యవహరిస్తారు. దేశంలో అతి పొడవు బ్రిడ్జిగా , సీ బ్రిడ్జిగా దీనికి గుర్తింపు దక్కింది. ఈ బ్రిడ్జిపై ఆరు వరుసలలో ప్రయాణాలు సాగుతూ ఉంటాయి.

ఈ ఆరులైన్ల బ్రిడ్జి నవీ ముంబై అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు చేరుకునేందుకు అత్యంత దగ్గరిదారి అవుతుంది. ముంబై, పుణేల నడుమ ప్రయాణకాలం తగ్గుతుంది. ఇక తీరంలోని రేవులకు కూడా ఇది ఉపయుక్తం అవుతుంది. స్థానిక ముంబై పోర్టు , జవహర్‌లాల్ నెహ్రూ పోర్టుల మధ్య రాకపోకలు మరింత సులువు అవుతాయి. ఈ సుదీర్ఘ వంతెన ఆరంభంతో మంబై పరిసరాలకు అత్యంత మరింత అధునాతన కళ ఏర్పడింది. ఈ వంతెన నిర్మాణ పనులకు ప్రధాని 2016 డిసెంబర్‌లో పునాదిరాయి వేశారు. ప్రధాని మోడీ శుక్రవారమే ఇక్కడ అండర్‌గ్రౌండ్ రోడ్ టన్నెల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ టన్నెల్ 9.2 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. నిర్మాణ వ్యయం రూ 8700 కోట్లుగా అంచనావేశారు. ఈ భూగర్భ టన్నెల్ నిర్మాణ పనులతో ఈస్టర్న్ ఫ్రీవే కు మెరైన్ డ్రైవ్ ప్రాంతానికి అనుసంధానం ఏర్పడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News