Saturday, July 27, 2024

పిఎంఎవై కింద 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వ సాయం

- Advertisement -
- Advertisement -

ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (పిఎంఎవై) కింద మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సోమవారం తన తొలి సమావేశంలో ఆమోదించింది. మోడీ 3.0 ప్రభుత్వంలో క్యాబినెట్ తొలి సమావేశం ప్రధాని7, లోక్ కల్యాణ్ మార్గ్ నివాసలో జరిగింది. ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాల మంత్రులు అందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. ‘అర్హులైన కుటుంబాల సంఖ్య పెరుగుదల వల్ల గృహవసతి అవసరాలు తీర్చేందుకు ఇళ్ల నిర్మాణం కోసం మూడు కోట్ల అదనపు గ్రామీణ,

పట్టణ ప్రాంత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయాలని సోమవారం క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించడమైంది’ అని అధికారులు వెల్లడించారు. కనీస సదుపాయాలతో ఇళ్ల నిర్మాణం కోసం అర్హులైన గ్రామీణ,పట్టణ ప్రాంత కుటుంబాలకు సహాయం అందజేయడానికి కేంద్ర ప్రభుత్వం 2015-16 నుంచి పిఎంఎవైని అమలు చేస్తున్నది. పిఎంఎవై కింద గడచిన పది సంవత్సరాలలో గృహవసతి పథకాల కింద అర్హులైన పేద కుటుంబాల కోసం మొత్తం 4.21 కోట్ల ఇళ్ల నిర్మాణం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News