Wednesday, October 9, 2024

జోబైడెన్‌తో ప్రధాని మోడీ భేటీ

- Advertisement -
- Advertisement -

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌తో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమయ్యారు. డెలావేర్‌లోని బైడెన్ నివాసంలో ఇద్దరు నేతలు భేటీ అయ్యారు. ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలు, వ్యూహాత్మక భాగస్వామ్యం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ఇరువురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది.

కాగా, శనివారం మోడీ అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ నెల 23 వరకు మూడు రోజులపాటు అమెరికాలో మోడీ పర్యటించనున్నారు. విల్మింగ్టన్​లో జో బైడెన్ అధ్యక్షతన జరగనున్న క్వాడ్​ లీడర్స్​​నాలుగో శిఖరాగ్ర సమావేశంలో మోడీ పాల్గొననున్నారు. ఈ సదస్సులో జోబైడెన్​తోపాటు ఇతర ప్రపంచ నేతలతో మోడీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే, ఆదివారం న్యూయార్క్ లోని ఐక్యరాజ్య సమితి అసెంబ్లీలో ‘సమిట్​ఆఫ్ ​ద ఫ్యూచర్​’ సదస్సులో మోదీ ప్రసంగించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News