Saturday, October 12, 2024

పారా అథ్లెట్లతో ప్రధాని మోడీ భేటీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఇటీవల పారిస్ వేదికగా జరిగిన పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు అసాధారణ ఆటతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. పారి స్ క్రీడల్లో భారత్ ఏకంగా 29 పతకాలు గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్ పతక విజేతలతో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని వారితో ప్రత్యేకంగా మాట్లాడారు. వారి ప్రతిభను, కృషిని కొనియాడా రు. అసాధారణ ప్రతిభతో భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటారని ప్రశంసించారు. పారాలింపిక్స్ వంటి మెగా టోర్నమెంట్‌లో భారత అథ్లెట్లు రికార్డు స్థాయిలో పతకాలను గెలుచుకోవడం దేశానికి గర్వకారణమన్నారు. వీరిని చూసి దేశం మొత్తం గర్విస్తుందన్నారు.

పతకాలు సాధించిన క్రీడాకారులను దేశం తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు ప్రధాని పేర్కొన్నారు. అథ్లెట్ల అంకితభావంతోనే ఇది సాధ్యమైందన్నాడు. పారా అథ్లెట్ల విజయం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమన్నారు. ఇదిలావుంటే ప్రధానితో జరిగిన సమావేశంలోని విశేషాలను పారాలింపిక్స్ స్వర్ణ పతక విజేత హర్విందర్ సింగ్ మీడియాతో పంచుకున్నారు. ప్రధాని మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారన్నారు. ప్రధానితో సమావేశం తమలో కొత్త ఉత్సాహాన్ని నింపిందన్నారు. ప్రధాని సలహాలు, సూచనలు తమకు ఎంతో ఉపయుక్తంగా మారాయని హర్విందర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News