Monday, April 29, 2024

రేపు కేంద్ర మంత్రివర్గంతో ప్రధాని మోడీ భేటీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రధాని మోడీ ఆదివారం తన అధ్యక్షతన కేంద్రమంత్రి వర్గ సమావేశాన్ని నిర్వహించనున్నారు. రెండోసారి తన ప్రభుత్వ హయాంలో ఇదే ఆఖరి కసరత్తు కావచ్చు. కీలకమైన ప్రభుత్వ విధానం, పాలనా పరమైన సమస్యలపై కేంద్ర మంత్రి మండలితో ప్రధాని మోడీ ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తుండటం పరిపాటిగా జరుగుతున్నప్పటికీ ఆదివారం నిర్వహించనున్న సమావేశానికి లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ఏప్రిల్‌మే మధ్య కాలంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్నారు. రెండు వారాల్లో ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీ లోని చాణక్యపురి డిప్లొమేటిక్ ఎన్‌క్లేవ్‌లో ఈ సమావేశం జరుగుతుంది.

బీజేపీ నేతృత్వం లోని నేషనల్ డెమొక్రటిక్ అలియెన్స్ (ఎన్‌డిఎ) తాను చేపట్టిన అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాల దృష్టా , మోడీ సారథ్యంలో తిరిగి మూడోసారి అధికారం లోకి రాగలమన్న నమ్మకంతో ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పనితీరు లోని ముఖ్యాంశాలను ఈ సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల నిర్వహణ కోసం వివిధ రాష్ట్రాల్లో సన్నాహాలపై ఎలెక్షన్ కమిషన్ సమీక్షలు ప్రారంభించింది. 2014లో తొమ్మిది దశల వారీగా లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు మార్చి 5న ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. ఆనాడు మే 16న ఫలితాలు వెలువడ్డాయి. 2019లో ఏడు దశల వారీగా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను మార్చి 10న ప్రకటించగా, మే 23న ఫలితాలు వెలువడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News