Sunday, December 15, 2024

అదానీని మోడీ రక్షిస్తున్నారు: రాహుల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గౌతమ్ అదానీని ప్రధాని నరేంద్ర మోడీ రక్షిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. అదానీపై యుఎస్‌లో లంచం ఆరోపణలపై రాహుల్ స్పందించారు. మోడీ వల్లే అదానీని ఇప్పటివరకు అరెస్టు చేయలేదని విమర్శలు గుప్పించారు. ఆఫీసర్లకు రెండు వేల కోట్లు లంచ ఇవ్వడం తీవ్రమైన కేసు అని అన్నారు. అదానీ చట్టలు ఉల్లంఘించారని యుఎస్‌లో బయటపడిందన్నారు. జెపిసి విచారణతో పాటు అదానీని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

ఓ భారీ కాంట్రాక్టు పొందేందుకు రూ. 2029 కోట్లు లంచాలు ఇవ్వజూపినందుకు అమెరికాలోని బ్రూక్లిన్ లోని ఫెడరల్ కోర్టులో అభియోగాలు మోపడంతో అదానీ షేర్లు భారీగా పడిపోయాయి. సౌర విద్యుత్తు కాంట్రాక్టులు పొందేందుకు భారతీయ అధికారులకు అదానీ గ్రూపు లంచాలు ఇచ్చిందని అమెరికా అధికారులు బుధవారం వెల్లడించారు.  అదానీకి చెందిన అనేక కంపెనీ షేర్లు మరింతగా క్షీణించాయి. అదానీ మిడ్ క్యాప్ షేర్లయితే రూ. 2 లక్షల కోట్లు మేరకు ఆవిరైపోయాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News