Wednesday, May 22, 2024

నేను ఉన్నంత వరకు ముస్లిం రిజర్వేషన్లకు నై

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మెదక్ ప్రతినిధి : ’నాకు రా జ్యాంగమే ధర్మగ్రంథం. నేను బతికి ఉన్నంత వరకు రాజ్యాంగాన్ని కాపాడుతాను. దళితు లు, ఎస్టీలు, ఓబీసీలకు రిజర్వేషన్లకు అండగా ఉంటా. మతపరమైన ముస్లిం రిజర్వేషన్లను అమలు కానిచ్చే ప్రసక్తి లేదు. కానీ కాంగ్రెస్ వస్తే రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తుంద’ని ప్ర ధాని మోడీ అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచా రంలో భాగంగా మెదక్ జిల్లాలోని జహీరా బాద్ పార్లమెంటు పరిధిలో గల అల్లాదుర్గం లో బిజెపి భారీ బహిరంగ సభను నిర్వహిం చింది. ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా కాం గ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ముదిరాజ్, లింగాయ త్‌లకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు. ముస్లింలకు రిజర్వేషన్ల ద్వారా రాజ్యాంగ వ్యతిరేక మతపర రిజర్వేషన్లకు పూనుకుందన్నారు. బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు బంజారా సమాజాన్ని కూడా మోసం చేశాయన్నారు. లింగాయత్‌ల రిజర్వేషన్లకు కాంగ్రెస్ వ్యతిరేకమని ఆరోపించారు.

2004లో కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఎపిలో రికార్డ్ స్థాయి ఎంపి సీట్లు వచ్చాయని, అయినా దళితులు, ఒబిసిలకు అన్యాయం చేసిందన్నారు. రాజ్యాంగం అంటే కాంగ్రెస్ పార్టీకి గౌరవం లేదన్నారు. అంబేడ్కర్ విషయంలోనూ అవమానకరంగా వ్యవహరిం చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి రాజ్యాంగానికి వ్యతిరేకమే అన్నారు. నెహ్రూ, ఇందిరాగాంధీ రాజ్యాంగాన్ని పలుమార్లు అవమానించారన్నారు. ఎమర్జెన్సీ విధించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని దుయ్యబట్టారు. నాడు ప్రధాని మన్మోహన్ సింగ్ తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను యువరాజు మీడియా ముందే చించివేయడం ద్వారా ప్రధానిని, రాజ్యాంగాన్ని అవమానించా రన్నారు. బిసి, ఎస్‌సి, ఎస్‌టిల హక్కులను కాలరాస్తూ మతపరమైన రిజర్వేషన్లను పెట్టి రాజకీయాలు చేస్తూ రాజ్యాంగాన్ని అవమానించారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ రాజకీయ అవసరాల కోసం రాజ్యాంగాన్ని ఉపయోగించుకుందని ఆరోపించారు. రాజీవ్ గాంధీ హయాంలో స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. రాజ్యాంగాన్ని తాను పవిత్ర గ్రంథంలా భావిస్తానని ప్రధాని అన్నారు. తాను మొదటిసారి ప్రధానిగా అయినప్పుడు పార్లమెంట్ భవనం ముందు మోకరిల్లానని గుర్తు చేసుకున్నారు.

2019లో రెండోసారి ప్రధాని అయ్యాక రాజ్యాంగ పవిత్ర గ్రంథాన్ని సెంట్రల్ హాలులో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని ఏనుకు అంబారీపై ఊరేగించానని, ఆ ఊరేగింపుతో తాను నడిచానన్నారు. తాను తొలి రోజు నుంచీ రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నానన్నారు. రాజ్యాంగానికి గౌరవం ఇచ్చిన ఒకే ఒక్క ప్రధానమంత్రిని తానేనన్నారు. రాజ్యాంగం అంటే తనకు మహాభారతం, రామాయణం, బైబిల్, ఖురాన్ వంటి పవిత్ర గ్రంథమన్నారు. రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు అన్యాయం చేసే మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని పునరుద్ఘాటించారు. రాజ్యాంగంపై తన చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరన్నారు. ’తెలంగాణ నుంచి ప్రకటిస్తున్నాను నేను మూడోసారి ప్రధాని అయ్యాక 75 ఏళ్ల రాజ్యాంగం సందర్భంగా అంగరంగ వైభవంగా ప్రతి పల్లెలో, ప్రతి పట్టణంలో రిపబ్లిక్ డేను నిర్వహిస్తాం’ అన్నారు. ఈ దేశాన్ని పాలించే హక్కు తమకు ఉందని కొందరు రాజవంశీకులు భావిస్తున్నారని చురక అంటించారు. ఎస్‌సి వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చారు.

‘భారత్‌ను కాంగ్రెస్ అవినీతి ఊబిలోకి నెట్టివేసింది’
తెలంగాణలో కాంగ్రెస్ డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తోందన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న చోట పంచసూత్రాలతో పాలన చేస్తుందని వెల్లడించారు. పదేళ్లలో దేశమెంత అభివృద్ధి చెందిందో అంతా చూశారన్నారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి ఏ స్థాయిలో ఉందో అందరూ చూశారన్నారు. ప్రపంచమంతా అభివృద్ధి చెందుతుంటే భారత్‌ను కాంగ్రెస్ అవినీతి ఊబిలోకి నెట్టి వేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నచోట పంచ సూత్రాలతో పాలన చేస్తుందని వెల్లడించారు. కాంగ్రెస్ పంచ సూత్రాలు అంటే అవినీతి, అబద్ధాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు, మాఫియా, కుటుంబ రాజకీయాలు అని ఎద్దేవా చేశారు. దేశంలో మళ్లీ పాతరోజులు తీసుకురావాలని కాంగ్రెస్ చూస్తోందని విమర్శించారు. ఈ పంచసూత్రాల పాలన ప్రజలకు అర్థమైందని వారి మాయలో ప్రజలు పడొద్దని హెచ్చరించారు. ఓటమి నైరాశ్యంలో కాంగ్రెస్ నేతలు దిగజారు తున్నారని విమర్శలు చేశారు.

తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫేక్ వీడియో సృష్టించారన్నారు. ఆ ఫేక్ వీడియోలను విడుదల చేసేవారిని వదిలి పెట్టమని హెచ్చరించారు. విపక్ష కాంగ్రెస్‌కు ఈసారి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని, చరిత్రలో ఎన్నడూ రానంత తక్కువ సీట్లు కాంగ్రెస్‌కు వస్తాయని జోస్యం చెప్పారు. ‘రైతులను భగవత్ స్వరూపాలుగా బిజెపి చూస్తుంది. 100 రోజుల్లో రుణమాఫీ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసింది. క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామన్న హామీను కాంగ్రెస్ నెరవేర్చలేదు. బిఆర్‌ఎస్ పాలనలో ఓటుకు నోటు కేసును తొక్కిపెట్టింది. కాంగ్రెస్, బిఆర్‌ఎస్ వేర్వేరు కాదు. బిజెపి వల్లే మహిళలకు రక్షణ. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తేనే ప్రజల సంపదకు రక్షణ ఉంటుంద’ని మోడీ అన్నారు. ‘అయోధ్యలో రామమందిర నిర్మాణం 500 ఏళ్ల భారతీయుల స్వప్నం. అయోధ్యలో రామమందిరం నిర్మాణం మోడీ వల్ల కాదు, మీ ఓటు వల్లే సాధ్యం అయింది. ప్రభుత్వం పటిష్టంగా ఉంటే కొత్త చరిత్రను ఎలా సృష్టిస్తామో మీరు చూశారు. హైదరాబాద్‌లో పండుగలు జరుపుకోవాలంటే ఎన్నో ఆంక్షలు ఉన్నాయి. ఓ వర్గం ఓట్ల కోసమే హైదరాబాద్‌లో పండుగలపై ఆంక్షలు విధించారు. మీరు వేసే ఒక్కొక్క ఓటు మీ కలలు సాకారం కోసం వినియోగిస్తా’నని మోడీ అన్నారు.

‘ట్రిపుల్ ఆర్ టాలీవుడ్ తీస్తే తెలంగాణలో డబుల్ ఆర్ నడుస్తుంది’
తెలంగాణలో డబుల్ ఆర్ ట్యాక్స్ నడుస్తుందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ గెలిస్తే మీపై వారసత్వం పన్ను వేయబోతున్నారని తెలిపారు. తెలంగా ణలో డబుల్ ఆర్ ట్యాక్స్ అంటే ఇప్పటికే మీకు అర్థమయి ఉంటు దన్నారు. డబుల్ ఆర్ ట్యాక్స్‌ను వ్యాపారవేత్తలు కట్టాల్ససి వస్తుందన్నారు. డబుల్ ఆర్ ట్యాక్స్‌కు షాక్ ఇవ్వకపోతే తెలంగాణలో రానున్న ఐదే ళ్లలో మరింత పతనమవుతుందని తెలిపారు. మీ సంపదలో 55 శాతం వెనక్కు లాక్కుంటామని చెబుతుందన్నారు. కాంగ్రెస్, బిఆర్‌ఎస్ అవినీతి ఢిల్లీ లిక్కర్ స్కామ్ వరకూ పాకిందన్నారు. తెలుగు సినిమా ఇండ్రస్ట్రీ త్రిబుల్ ఆర్‌తో సూపర్ హిట్ సినిమా ఇచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేసి ఢిల్లీకి డబ్బులు పంపుతుందని వెల్లడిం చారు.

కేంద్రంలో కాంగ్రెస్ వస్తే ప్రజల సొమ్ముకు రక్షణ లేకుండా పోతుం దన్నారు. లిక్కర్ కేసు బయటపడ్డాక ఇద్దరు తోడు దొంగలు ఎవరో అర్థమయిందన్నారు. బిఆర్‌ఎస్, కాంగ్రెస్ ఒకగూటి పక్షులేనన్నారు. మొన్నటి వరకు తెలంగాణను బిఆర్‌ఎస్ దోచుకుందని, ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణను దోచుకుంటోందని ఆరోపించారు. బిఆర్‌ఎస్ పాలనలో కాళేశ్వరం అతి పెద్ద కుంభకోణం అని అన్నారు. బిఆర్‌ఎస్ పాలనలో ఓటుకు నోటు కేసును తొక్కిపెట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్, బిఆర్‌ఎస్ వేర్వేరు కాదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరం స్కాంపై కాంగ్రెస్ మాట్లాడిందన్నారు. అధికారంలోకి రాగానే కాళేశ్వరం స్కాంను తొక్కిపట్టిందని విమర్శించారు. స్కాంలపై కాంగ్రెస్, బిఆర్‌ఎస్ నేతలు సహకరించుకుంటున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఫేక్ వీడియోలు సృష్టించి ప్రజల్లో ఆందోళన కలిగిస్తూ

తెలంగాణ సమాజాన్ని విచ్ఛిన్నం చేయుటకు కాంగ్రెస్ యత్నం
అలాంటి వారి ఆటలు సాగనివ్వం
గల్లీ గల్లీలో కాంగ్రెస్ చేస్తున పాపాలను కార్యకర్తలకు వివరించి మూడవసారి బిజెపిని కేంద్రంలో అధికారంలోకి తీసుకురావాలని కార్యకర్తలను కోరారు. రాజ్యాంగం రచించి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో రాజ్యాంగంపై రాజ్యవంశీయులైన రాహుల్‌గాంధీ కుటుంబం చేసిన పాపాలను ఎండగట్టంతో పాటు వారి బాగోతాలు బయటపెడతామని హెచ్చరించారు. ఫేక్ వీడియోలు సృష్టించి ప్రజల్లో ఆందోళన కలిగిస్తూ తెలంగాణ సమాజాన్ని విచ్ఛిన్నం చేయుటకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, అలాంటి వారి ఆటలు సాగినవ్వమన్నారు. పేదవారి సంక్షేమమే బిజెపి సంకల్పమని తెలంగాణ ప్రజల్లో బిజెపిపై అత్యంత విశ్వాసం కనబరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణకు నాలుగు వందేభారత ఎక్స్‌ప్రెస్‌లతో పాటు 40 రైల్వేస్టేషన్లు ఇచ్చామని గుర్తు చేస్తూ రాష్ట్రంలో ఎన్నో జాతీయ రహదారులు వేసి రవాణా సౌకర్యం కల్పించడమే కాకుండా అన్ని రంగాలలో రాష్ట్రానికి సముచిత న్యాయం చేశామన్నారు. కార్యక్రమంలో జహీరాబాద్‌క్ష పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్, మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్‌రావు, కామారెడ్డి ఎంఎల్‌ఎ వెంకటరమణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, మహిళా మోర్చా, యువ మోర్చా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో పాటు తదితరులు పాల్గన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News