Saturday, April 27, 2024

ఏనుగుపై ప్రధాని మోడీ విహారం

- Advertisement -
- Advertisement -

కజిరంగ(అసోం): ప్రధాని నరేంద్ర మోడీ శనివారం అసోంలోని జాతీయ కజిరంగ జాతీయ అభయారణ్యం , పులుల సంరక్షణ కేంద్రంలో పర్యటించారు. కజిరంగలో జీపులో సఫారీ నిర్వహించారు. ఏనుగు ఎక్కి కొంతసేపు విహరించారు. యునెస్కో గుర్తింపు పొందిన ఈ అభయారణ్యానికి ప్రధాని మోడీ రావడం ఇదే తొలిసారి. రెండు గంటలు ఇక్కడ గడిపారు. దేశ ప్రధాని ఒక్కరు 1957 తరువాతఈ అభయారణ్యానికి రావడం ఇదే తొలిసారి. రెండు రోజుల పర్యటనకు ప్రధాని మోడీ శుక్రవారం సాయంత్రం అసోంకు వచ్చారు.

ప్రత్యేక హెలికాప్టర్‌లో గోలాఘాట్ జిల్లాలోని కజిరంగకు చేరారు. రాత్రిపూట ఈ జాతీయ పార్క్‌లోనే బస చేశారు. ఉదయం పూట ఏనుగు ఎక్కి విహరించిన ప్రధాని తరువాత అడవి అంతా జీపు సఫారీ చేశారు. ప్రకృతి అందాలను, జంతువులను కెమెరాతో క్లిక్ మన్పించారు. మోడీ వెంబడి పార్క్ డైరెక్టర్ సోనాలీ ఘోష్, అటవీశాఖాధికారులు ఉన్నారు. ఇక్కడ ఖడ్డమృగాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. అయితే తనకు ఎక్కువగా ఏనుగులు కన్పించాయని ప్రధాని వ్యాఖ్యానించారు. పూర్తిగా ఫారెస్టు ఆఫీసర్ల సఫారీ డ్రెస్‌తో నెత్తిన టోపీతో ఆయన ప్రద్యుమ్న గజంపై సాగారు.

మావటి రాజు ఏనుగును నడిపించారు. కాగా 16 ఏనుగుల బృందం ఈ సఫారీ క్రమంలో అనుసరించింది. ఈ పార్క్ సందర్శన క్రమంలో ప్రధాని మోడీ మహిళా అటవీ సంరక్షకుల బృందం వనదుర్గతో ముచ్చటించారు. వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. వారి ధైర్యసాహసాలను కొనియాడారు. ఈ జాతీయ పార్క్ సందర్శనకు తరలిరావాలని, ఇక్కడి పలు అందాలు మీ ముందుంచుతున్నానని ప్రధాని ఆ తరువాత ట్వీట్ వెలువరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News