Monday, September 1, 2025

మణిపుర్‌ను సందర్శించనున్న ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: జాతి కలహాలతో అట్టుడుకుతున్న మణిపుర్‌ను సెప్టెంబర్ మధ్యలో ప్రధాని నరేంద్ర మోడీ సందర్శించనున్నారు. దాదాపు 28 నెలల విరామం తర్వాత ఆయన ఈ ఈశాన్య రాష్ట్రాన్ని సందర్శించనున్నారు. అక్కడ కీలక మౌలిక ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఆయన మణిపుర్‌లో సెప్టెంబర్ 12 నుంచి 14 మధ్య సందర్శించనున్నారని సమాచారం. ఇదే సందర్భంగా ఆయన మిజోరం, అస్సాంలలో కూడా పర్యటించనున్నారు. మణిపుర్‌లోని ఇంఫాల్, చురాచాంద్‌పుర్‌లను ఆయన సందర్శించనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన జాతి కలహాలతో నిరాశ్రయులైన బాధితులను కలుసుకుంటారని వినికిడి. ఇదిలావుండగా గత కొన్ని నెలలుగా మణిపుర్‌లో ఎలాంటి హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోలేదన్నది గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News