పొరుగు దేశాలుగా సత్సంబంధాలు కొనసాగాలి
ప్రపంచంలో శాంతి, శ్రేయస్సు కోసం ఇరు దేశాలు బాధ్యత తీసుకోవాలి:చైనా అధ్యక్షుడు
జిన్‌పింగ్ పిలుపు చైనాతో సానుకూల సంబంధాలకు భారత్ కట్టుబడి ఉంది
సరిహద్దు తదితర వివాదాలకు ఆమోదయోగ్య పరిష్కారం
ప్రపంచ వాణిజ్య స్థిరీకరణకు చర్యలు: ప్రధాని మోడీ గంటకు పైగా
జిన్‌పింగ్, మోడీ చర్చలు రెండు దేశాల మధ్య విమాన సర్వీసులు, మానస సరోవర్ యాత్ర
పునరుద్ధరణకు అంగీకారం
తియాంజిన్(చైనా): భారత్-చైనాలు రెండూ మిత్రదేశాలుగా కదలాలి. కేవలం సరిహద్దు వివాదాలే ఇరు దేశాల సంబంధాలకు గీటురాయి కారాదని చైనా అధ్యక్షులు జి జిన్‌పింగ్ చెప్పారు. చైనా పట్టణం తియాంజిన్‌లో ఆదివారం మొదలైన షాంఘై సహకార శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని మోడీ కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఇరుదేశాల నే తల మధ్య గంటకు పైగా చర్చలు జరిగాయి. ఈ దశలో ఇక రెండు దేశాలు కలిసికట్టుగా ఉండటమే అత్యుత్తుమ మార్గం అని జిన్‌పింగ్ ఈ సందర్భంగా ప్రధాని మోడీకి చెప్పారు. విస్తారిత సరిహద్దుల దేశాలు కావడంతో సహజంగానే కొన్ని అం శాలపై విభేదాలు ఉండవచ్చు. కానీ వీటి ప్రాతిపదికన అనివార్యంగా ఉండాల్సిన మిత్రత్వ బంధం చె క్కుచెదరరాదని , ఇది తమ సూచన ఆలోచన అని జిన్‌పింగ్ చెప్పారు. రెండు అతి పెద్ద ఆసియా దేశా ల మధ్య సరిహద్దు వివాదా లు ఉంటే వాటిని శాం తియుతంగా, సౌభాతృత్వంతో పరిష్కరించుకోవ ల్సి ఉంటుంది. ప్రశాంతత నెలకొనాల్సి ఉం టుంద ని స్పష్టం చేశారు.
మనం శత్రువులు కాదు, సవాళ్లు వీడాలి, పరస్పర సహకారంతో సాగితే దక్కే పలు అవకాశా లు సంయుక్తంగా మనవే అవుతాయని చైనా నేత తెలిపా రు. ఏ ఒక్క కారణం కూడా ఇరుదేశాల మైత్రికి అడ్డుకాకూ డదని పిలుపు నిచ్చారు ఈ ఏడాది 2025కు ప్రత్యేకత ఉంది. రెండు దేశా ల మధ్య దౌత్య సంబంధాల స్థాపన జరిగి 75 సం వత్సరాలు అవుతోంది. వీటిని మరింత సమున్నత స్థాయికి తీసుకువెళ్లాలి. ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక , దీర్ఘకాలిక దృక్పథంతో నిర్వహించుకోవడం ద్వారా ఉభయపక్షాల ఇతోధిక, స్థిరత్వపు ప్రగతి పటిష్టం కావల్సి ఉందన్నారు. అన్నింటికీ అ తీతంగా బంధం ఉంటే , సరిహద్దుల విషయాలు ముఖ్యం కావడం జరగదని చెప్పారు. ప రస్పర స మన్వయంతో ముందుకు సాగితే పలు విధాలుగా సత్ఫలితాలను రాబట్టుకోవచ్చు అన్నారు. మన బంధం బాగుంటే డ్రాగన్ ఎలిఫెంట్ కలిసికట్టు నృ త్యంగా సాగేందుకు వీలుంటుందన్నారు. ట్రంప్ సుంకాలపై జిన్‌పింగ్ పరోక్షంగా విమర్శలకు ది గారు. ఏకపక్ష విధానాలతో అందరికీ చేటు వాటిల్లుతుంది. భారత్ చైనాలు బహుళత్వ ప్ర యోజనాలను చాటుకోవల్సి ఉంటుందని తెలిపారు. ఈ దిశ లో ఇరుదేశాలు ఇప్పుడు అత్యంత కీలకమైన చారిత్రక పాత్ర పోషించాల్సి ఉందన్నారు. ఆసియా , ప్రపంచ స్థా యిలో శాంతి సుస్థిరత వైపు ఇరుదేశా ల బంధం మరో మై లురాయి కావాలని ఆకాంక్షించారు. ప్రపంచం ఇప్పుడు శతాబ్ధంలో ఓ సారి చో టుచేసుకునే కీలక పరివర్తన దశను సంతరించుకుందని మోడీతో చెప్పారు.
అంతర్జాతీయ స్థాయి లో పరిస్థితి కల్లోలంగా, ఎప్పుడేం జరుగుతుందో తె లియని స్థితిలో ఉంది. తూర్పున భారత్ చైనాలు అత్యంత పురాతన నాగరికతల దేశాలు. ప్రపంచంలోనే అత్యధిక జ నాభాతో ఉన్న దేశాలు, గ్లోబల్ సౌత్‌లో అత్యంత అనుభ వం ఉన్న పాత సభ్యదేశా లు అని చెప్పారు. భారత్ చైనా సరిహద్దుల వివాదాల పరిష్కారానికి ప్రధాని మోడీ, చైనా నేత జిన్‌పింగ్ చర్చలతో మార్గం ఏర్పడింది. వివాదాలను సవ్యమైన, సముచితమైన, పరస్పర ఆమోదయోగ్య మార్గాలలో పరిష్కరించుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించారు.గ్లోబల్ వాణిజ్య పరిస్థితి స్థిరీకరణకు ఇరు దేశాల మ ధ్య వ్యాపార వాణిజ్య పెట్టుబడుల వృద్ధికి చర్యలు అవస రం అని అభిప్రాయపడ్డారు. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థ లు ప్ర పంచ మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని, సం యుక్తంగా కదిలితే దీని ప్రభావం సత్పలితాలకు దారితీస్తుందని పేర్కొన్నారు.
ముందుగా సరిహద్దు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని జిన్‌పింగ్‌కు ఈ సందర్భంగా మోడీ చెప్పారు. విశ్వాసం , ఆదరణ ప్రాతిపదికన ముం దుకు సాగేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. చర్చలు ఫలప్రదం అయ్యాయని ఆ తరువాత ప్రధాని మోడీ సామాజిక మాధ్యమంలో తెలిపారు. ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు, వీసా సౌకర్యా లు అవాంతరాలు లే కుండా కల్పించుకుంటారు. దీనితో ఇరు దేశాల పౌరుల మధ్య సత్సంబంధాల కు, పరస్పర పర్యటనకు వీలేర్పడుతుందని ఇరువు రు నేతలు అంగీకరించారు.మానససరోవర్ యా త్ర,ఇతర టూరిస్టు వీసాల పునరుద్ధరణకు తక్ష ణ ఏర్పాట్లకు కూడా ఇరవురు నేతలు అంగీకారానికి వచ్చారు. తియాంజిన్‌లో షాంఘై సదస్సుకు చైనా సారధ్యానికి భారత్ మద్దతును మోడీ ప్రకటించారు. వచ్చే ఏడాది భారత దేశ ఆధ్వర్యంలో జరిగే బ్రిక్స్ సదస్సుకు జిన్‌పింగ్‌ను ఆహ్వానించారు.