Saturday, April 27, 2024

మూడేళ్లలో ప్రధాని విదేశీ పర్యటనలు 21..ఖర్చు రూ. 22.76 కోట్లు !

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ 2019 నుంచి చేసిన విదేశీ పర్యటనలు 21. ఖర్చు రూ. 22.76 కోట్లు. ఈ వివరాలను ప్రభుత్వం గురువారం వెల్లడించింది. ఇక 2019 నుంచి రాష్ట్రపతి చేసిన విదేశీ పర్యటనలు ఎనిమిది. అయిన ఖర్చు రూ. 6.24 కోట్లు. రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ విదేశాంగ వ్యవహారాల సహాయ మంత్రి వి. మురళీధరన్ ఈ వివరాలు తెలిపారు. 2019 నుంచి రాష్ట్రపతి పర్యటన వల్ల ప్రభుత్వానికి రూ. 62431424 ఖర్చు కాగా, ప్రధాని పర్యటనల వల్ల రూ. 227676934, విదేశ వ్యవహారాల మంత్రి 86 విదేశీ పర్యటనల వల్ల 208701475 అని మురళీధరన్ తెలిపారు.

2019 నుంచి ప్రధాని జపాన్‌కు మూడు సార్లు, అమెరికాకు రెండుసార్లు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు రెండు సార్లు పర్యటించారు. ఇక రాష్ట్రపతి రామ్‌నాథ్ కొవింద్ ఏడుసార్లు, కొత్త రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యునైటెడ్ కింగ్‌డమ్‌కు సెప్టెంబర్‌లో ఒకసారి పర్యటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News