Wednesday, February 1, 2023

అమరుడు పోలీస్ కృష్ణయ్య స్ఫూర్తిని కొనసాగించాలి

- Advertisement -

– సూర్యాపేట పట్టణ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్

మనతెలంగాణ/సూర్యాపేట న్యూస్ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర మలిదశ ఉద్య మ అమరుడు, ముదిరాజ్ ముద్దు బిడ్డ పోలీస్ కృష్ణయ్య స్పూర్తిని ప్రతి ఒక్క రు కొనసాగించాలని సూర్యాపేట పట్టణ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్, ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు ఈదుల యాదగిరిలు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో పాతబస్టాండ్ వద్ద పోలీస్ కృష్ణయ్య 13వ వర్ధంతి సందర్భంగా ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ కృష్ణ య్య అమరత్వం తెలంగాణ ఉద్యమకారుల ఎందరికో స్పూర్తినిచ్చిందన్నా రు. పోలీస్ కృష్ణ ప్రాణత్యాగం తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి ప్ర త్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటకు బాటలు వేసిందన్నారు. కృష్ణయ్య ముదిరాజ్ బిడ్డ కావడం మనందరం గర్వించాల్సిన విషయమని ఆయన ఆశయ సాధనకు ప్రతి యొక్క ముదిరాజ్ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టి ఆర్‌ఎస్ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆకుల లవకుశ, ముదిరాజ్ మహాసభ జిల్లా యువజన అధ్యక్షుడు ఇండ్ల సురేష్, నాయకులు గుంటి సైదులు, శ్రీకాంత్, నల్లమేకల వెంకన్న, నక్క సాయి, యాటా అశోక్, పవన్, దండు రేణుక, ఢిల్లీ పావని, సారగండ్ల వెంకటమ్మ, నర్ర నాగరాజు, మల్సూర్ పాల్గొన్నారు.

మిర్యాలగూడ టౌన్‌లో.. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణాలర్పించి అమరుడైన పోలీస్ కృష్ణయ్య ముదిరాజ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృ షిచేయాలని ముదిరాజ్ సంఘం మిర్యాలగూడ నియోజకవర్గ అధ్యక్షుడు అ వదారపు మురళి అన్నారు. పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద తెల ంగాణ ముదిరాజ్ మహసభ రాష్ట్ర అధ్యక్షులు బండా ప్రకాష్ పిలుపు మేరకు గురువారం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో అమరుడైన పోలీస్ కృష్ణయ్య ముదిరాజ్‌కు ముదిరాజ్ సంఘం నాయకులు 13వ వర్థంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు నాయ కులు పోలీస్ కృష్ణయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పి ంచారు. ఈ కార్యక్ర మంలో ముదిరాజ్ సంఘం నాయకులు బంటు వెంకటేశ్వర్లు, మె రుగు శ్రీ ను, జయరాజ్, బంటు శ్రీను, బంటు సత్యం, వెంకటేశ్వర్లు, బొడ్డు నరేష్, పర్శనబోయిన అనిల్ , నక్క రాజేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

హాలియాలో.. తొలి అమరుడైన పోలీస్ క్రిష్టన్న త్యాగం వెలకట్టలేనిదని ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకులు పిడిగం నాగయ్య అన్నారు. గురువారం హాలియాలోని అమరవీరుల స్థూపం వద్ద పుట్టుకొక్కుల సత్తయ్య ము దిరాజ్(క్రిష్ణన్న) వర్థంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు రాసిక హనుమయ్యముదిరాజ్, నాశనబోయిన వెంకటేశ్వర్లు, యలకాని వెంకటేశ్వర్లు, వర్ర వెంకట్‌రెడ్డి, ప్రసాద్‌నాయక్, లింగంపల్లి శ్రీనివాస్, తూటిపల్లి లక్ష్మినారాయణ, లింగంపల్లి చినమారయ్య, మంగయ్య, శేఖర్, పుట్ట దుర్గారావు, పెరుమాళ్ల నాగేష్ తదితరులు పాల్గొన్నారు.

యాదాద్రిలో.. తెలంగాణ ఏర్పాటు మలిదశ ఉద్యమంలో స్వరాష్ట్రం ఏర్పటు కోసం అమరుడైన పోలీసు కిష్టయ్య ముదిరాజ్ కు యాదగిరిగుట్ట పట్టణంలో మూదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘన నివాళి అర్పించారు. గురువారం పోలీసు అమరుడైన కిష్టయ్య 13 వర్ధంతి సందర్బంగా పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద కిష్టయ్య చిత్రపటాని ఏర్పాటు చేసి సంతాపంతో నివాళి అర్పించారు. నేతలు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు ఉద్యమంలో పోలీసు కిష్టయ్య స్వరాష్ట్రంతోనే ఈ ప్రాంత ప్రజలకు కష్టాలు పోతాయని భవనతో తన ప్రాణానికూడ లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రం కోరుతూ అమరుడైనాడని, పోలీసు ఉద్యోగా ఉండి తాను చేసిన త్యాగం తెలంగాణ చరిత్రలో నిలిచి పోతుందని అన్నారు. నివాళి అ ర్పించిన వారిలో మున్సిపల్ చైర్మన్ ఎరుకుల సుధాహేమెందర్ గౌడ్, సిఐ సై దులు, ఎస్సై శేఖర్, నాయకులు కర్రె వెంకటయ్య,కౌన్సులర్ బడిది సురెంద ర్,వంగపల్లి అరుణ్‌కుమార్, ఇండ్ల వెంకటేష్,ఆకుల గిరిబాబు, కృష్ణ, సుధాకర్, ఎల్‌ఎన్ రావు ,శ్రీహరి,నర్సింహ్మ,వెంకటేష్, గణేష్,ఉప్పలయ్య పాల్గొన్నారు.

గుండాలలో..గుండాల మండలం అనంతారం గ్రామంలో ముదిరాజ్ మ హాసభ ఆధ్వర్యంలో పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ 13వ వరదంతి సంద ర్భ ంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పి ంచారు. గు ం డాల మండల అధ్యక్షుడు నాగారపు రమేష్ ముదిరాజ్ మాట్లాడుతూ ఉద్య మంలో విధి నిర్వహణలో ఉన్న పోలీస్ కిష్టయ్య తెలంగాణ కోసం ఆ త్మా ర్ప ణ చేసుకొని 13 సంవత్సరాలు పూర్తయిన మా మదిలో ఎప్ప టికీ ఉం టా డని రాష్ట్రవ్యాప్తంగా కుల సంఘాల ద్వారా స్మరించుకోవాలని మ హాసభ తీ ర్మానం చేసింది అందులో భాగంగానే మండల కమిటీ ఆధ్వర్యంలో కా ర్య క్రమం నిర్వహించామని అన్నారు ఈ కార్యక్రమంలో సంగం నా య కులు కొలిపాక స్వామి, మారబోయిన యాదయ్య, నాగారపు భిక్షపతి, బా లరా జ్,భిక్షపతి, నర్సింహా,యువజన నాయకులు నాగారపు రామ్, మారబో యిన క్రాంతి కుమార్, ముదిరాజ్ బంధుమిత్రులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles