Monday, April 29, 2024

మైక్రోఫైనాన్స్‘యాప్’లపై పోలీసు నిఘా

- Advertisement -
- Advertisement -

‘రుణ’ బాధితులకు పోలీసుల భరోసా

Police surveillance on microfinance apps

మనతెలంగాణ/హైదరాబాద్: అన్‌లైన్‌లో నిరుద్యోగ,నిరుపేదలకు అధికవడ్దీలతో రుణాలు ఇస్తూ దారుణంగా వేధింపులకు పాల్పడుతున్న యాప్‌లపై పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో నిఘా సారిస్తున్నారు. మైక్రోఫైనాన్స్ మాదిరిగానే ఆన్‌లైన్‌లో కొన్ని విదేశీ, స్వదేశీ యాప్‌ల నుంచి అధికవడ్డీలకు రుణాలు తీసుకుని బలవన్మరణాలకు పాల్పడిన విషయం విదితమే. ఇదివరలో రుణయాప్‌లపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దాడులు నిర్వహించినప్పటికీ ఆన్‌లైన్‌లో మరికొన్ని కొత్త యాప్‌లు దర్శనమివ్వడంతో సైబర్ క్రైం పోలీసులు అప్రమత్తమైయ్యారు. దీంతో సుప్రీంకోర్టు నిషేధించిన మైక్రోఫైనాన్స్ బాటలోనే ఈ యాప్‌లను నిర్వహిస్తున్నట్లు పోలీసుల అంతర్గత విచారణలో తేలడంతో ఆన్‌లైన్‌లో రుణాలు ఇస్తున్న యాప్‌లపై ప్రత్యేక దృష్టి సారించారు.

ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండానే గూగుల్ ప్లేస్టోర్ లో, యాప్ స్టోర్ లో దర్శనమిస్తున్న మనీ బాక్స్, మనీ కింగ్, క్యాష్ ట్రెయిన్, క్యాష్ సూపర్, మనీ ట్యాప్, పే సెన్స్,ధని,మనీలెండ్స్,క్రెడిట్ బీ, క్యాష్ ఈ, మనీవ్యూ, ఎర్లీసేలరీ, స్మార్ట్ కాయిన్, లేజీపే, ఎనీటైమ్ లోన్స్, ఎమ్ పాకెట్, ఫ్లెక్స్ సేలరీ, రూపీల లావాదేవీలపై పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో నిఘా సారిస్తున్నారు. వీటితో పాటు మరికొన్ని యాప్‌ల ద్వారా రుణాలు ఇస్తూ సామాన్యులను, విద్యార్థినీ విద్యార్థులను ఆకర్షిస్తున్నట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. ఆన్‌లైన్ వేదికగా కొత్త రకం రుణ వ్యాపారంలో విద్యార్థులు, నిరుద్యోగులకు టార్గెట్ చేసే క్రమంలో జస్ట్ ఆధార్ కార్డ్..పాన్ కార్డ్ ఉంటే చాలు డబ్బులు ఆన్ లైన్‌లో రుణాలు ఇచ్చేస్తున్నారని, రూ. 1000 నుంచి రూ. 2 లక్షల వరకు అప్పులు ఏలాంటి ష్యూరిటీలు లేకుండా ఇచ్చేస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. రుణం ఇచ్చే ముందు సమీప బంధువులు, మిత్రులు పదిమంది షూరిటీతో పాటు వారి కాంటాక్ట్ ఫోన్ నంబర్లు ష్యూరిటీగా పంపితే చాలని రుణయాప్ నిర్వహకులు పేర్కొంటున్నారని పోలీసులు వివరిస్తున్నారు.

బాధితులకు పోలీసుల భరోసా:

మనీ బాక్స్, మనీ కింగ్, క్యాష్ ట్రెయిన్, క్యాష్ సూపర్, మనీ ట్యాప్, పే సెన్స్,ధని,మనీలెండ్స్,క్రెడిట్ బీ, క్యాష్ ఈ, మనీవ్యూ, ఎర్లీసేలరీ, స్మార్ట్ కాయిన్, లేజీపే, ఎనీటైమ్ లోన్స్, ఎమ్ పాకెట్, ఫ్లెక్స్ సేలరీ, రూపీల నుంచి ఏలాంటి మేసేజ్ వచ్చిన ఎవరు భయపడాల్సిన పని లేదని పోలీసు అధికారులు ధైర్యం చెబుతున్నారు. ఎవరైన యాప్‌ల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించాలని వేధించినా, ఒత్తిడి చేసినా వెంటనే సమీపంలో స్టేషన్‌లో ఫీర్యాదు చేయాలని బాధితులకు పోలీసులు అభయమిస్తున్నారు. ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా రుణం తీసుకుని తిరిగి చెల్లించని పక్షంలో సదరు రుణం తీసుకున్న వ్యక్తి ఇచ్చిన 10 నంబర్లకు మెసేజ్‌లు పంపుతారని, ష్యూరిటీగా ఎవరి ఫోన్ నంబర్లు తీసుకున్నారో వారందరికీ వాట్సాప్ లో మీరు ఫలానా వారికి షూరిటీ ఉన్నారని బెదిరింపులకు పాల్పతూ రుణాలకు సంబంధించి వడ్డీతో సహా వసూలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు.

మరికొందరికి తీసుకున్న డబ్బులు వెంటనే కట్టకపోతే మా మనుషులు మీ ఇంటికి వస్తారని, కేసు పెడుతున్నామని, కేసు పెడితే ఎన్ని సంవత్సరాలు జైలు శిక్షపడుతుందో అన్ని వివరాలతో వాట్సాప్ కు మెసేజ్ పంపుతున్నారని వివరించారు. అంతేకాకుండా రుణం ఎవరు తీసుకున్నారో వారి పేరు ఫోన్ నంబర్ , అడ్రస్ తో సహా అన్ని వివరాలు పంపుతారని, నిజానికి ఈ మెసేజ్ రిసీవ్ చేసుకున్న వ్యక్తికి లోన్ తీసుకున్న వ్యక్తికి అసలు సంబంధం కూడా ఉండకపోయినా మెసేజ్‌లు పంపుతూ వేధిస్తారని తెలిపారు. తెలుగు రాష్ట్రాలలో మనీ బాక్స్, మనీ కింగ్, క్యాష్ ట్రెయిన్, క్యాష్ సూపర్, మనీ ట్యాప్, పే సెన్స్,ధని,మనీలెండ్స్,క్రెడిట్ బీ, క్యాష్ ఈ, మనీవ్యూ, ఎర్లీసేలరీ, స్మార్ట్ కాయిన్, లేజీపే, ఎనీటైమ్ లోన్స్, ఎమ్ పాకెట్, ఫ్లెక్స్ సేలరీ, రూపీ యాప్‌లపై పోలీసులకు వేలాది ఫిర్యాదు వచ్చాయని వివరించారు. అవసరానికి తీసుకున్న రుణానికి వడ్డీలు చెల్లించలేక బాధితులు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నారని, పోలీసులు లోన్ చెల్లించకుంటే మీ పై కేసు పెట్టి అరెస్ట్ చేయిస్తామని చెప్పే మాటలు నమ్మవద్దని బాధితులకు సూచిస్తున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News