Thursday, April 25, 2024

వైఎష్ షర్మిలతో మాజీ ఎంపి పొంగులేటి భేటి!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలతో మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భేటి అయ్యారు. మంగళవారం జరిగిన ఈ సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పొంగులేటి పట్ల గత కొంతకాలంగా షర్మిలకూడా సానుకూల ధోరణితోనే ఉన్నారు. రానున్న ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని పాలేరు నుంచి పోటీ చేయనున్నట్టు షర్మిల ఇప్పటికే ప్రకటించారు. రాజశేఖర్‌బిడ్డ పాలేరు నుంచి పోటీ చేస్తుందని పాలేరు మట్టిసాక్షిగా మాట ఇచ్చిందని మీడియా ముందు మరో మారు వెల్లడించారు.

ఈ నేపధ్యంలో ఖమ్మం జిల్లా రాజకీయాల్లో బలమైన నేతగా ఉన్న మాజీ ఎంపి పొంగులేటి వైఎస్‌ఆర్‌టిపి అధినేత్రిని కలవటంతో రాజకీయంగా ఖమ్మం జిల్లా రాజకీయ సమీకరణల్లో మార్పులు వచే అవకాశాలు కన్పిస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. షర్మిల కూడా శ్రీనివాస్‌రెడ్డి చేరిక పట్ల స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పునాది వైఎస్‌ఆర్ అని వెల్లడించారు. వైఎస్‌ఆర్ పేరుమీద పైకొచ్చిన ఆయనకు ఆ కృతజ్ణత ఉంటుందని తాను అనుకుంటున్నా అని పరోక్షంగా శ్రీనివాసరెడ్డి రాజకీయ భవిష్యత్తుకు ఎటువైపు అడుగులు పడబోతోందో స్పష్టత నిచ్చారు. పోంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా ప్రస్తుతం టీఆర్‌ఎస్‌పార్టీలో కొంత అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం.

ఇటీవల ఆయన తన ముఖ్య అనుచరులు, అభిమానులు, తన వర్గీయులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఏగూటి పక్షి ఆగూటికే చేరుతుందని ఆయన తన పార్టీ మార్పుపై నర్మగర్భితంగా పేర్కొన్నారు.జిల్లా ప్రజలు కోరుకున్నట్టు ముందుకెళ్తానని వెల్లడించారు. రాజకీయ నాయకుడు ప్రజల దీవెనలు అభిమానం పొందితేనే రాజకీయాల్లో రాణిస్తాడన్నారు. రాబేయే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తామని ప్రకటించారు. జరిగిన పరిస్థితుల నేపధ్యంలో ఆయన ఆ పార్టీ నుంచి బయటపడే ఆలోచనలో ఉన్నట్టు ఖమ్మంకు చెందిన ఆయను వర్గీయులు కొందరు చెప్పుకొచ్చారు. బీజేపిలో చేరతారని, ఇప్పటికే ఆయన బీజేపి పెద్దలతో చర్చలు జరిపినట్టు వార్తలు కూడా వచ్చాయి. ఈ పరిస్థితుల్లో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీలో చేరికకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకే షర్మిలతో సమావేశం అయినట్టు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News