Saturday, April 27, 2024

నిరుద్యోగం పెరిగి అందరూ వ్యవసాయం వైపు చూడాల్సి వస్తుంది: పొన్నం ప్రభాకర్

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ను స్ఫూర్తిగా తీసుకొని వ్యవసాయ రంగంలో మరింత ముందుకు పోవాలని రవాణా బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సాంకేతిక విప్లవాన్ని వ్యవసాయంలో సృష్టించాలని డిగ్రీ వ్యవసాయ విద్యార్థులకు సూచించారు. నిరుద్యోగం పెరిగి అందరూ వ్యవసాయం వైపు చూడాల్సి వస్తుందని, వ్యవసాయంలో ఆర్థికంగా మరింత ఎదగాలని, రైతే దేశానికి వెన్నెముక అని, మహిళలుగా క్షేత్ర స్థాయిలో మరింత రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.  కరీంనగర్ మండలంలోని ముగ్ధుంపూర్ గ్రామంలో 3 కోట్ల రూపాయలతో వెనకబడిన తరగతుల నిధులతో మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల వ్యవసాయ బాలికల డిగ్రీ కళాశాల నిర్మాణానికి మంత్రి పొన్నం ప్రభాకర్, మానకొండురు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణలు శంఖుస్థాపన చేశారు. వ్యవసాయ డిగ్రీ కాలేజీ విద్యార్థినులతో  మంత్రి పొన్నం ప్రభాకర్ ముచ్చటించారు.

కాలేజీని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మంజూరు చేయించారని, రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నామని, ఇక్కడ డంప్ యార్డు ఉండేదని, కాలేజీ నిర్మిస్తున్నామని, ప్రభుత్వం వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని, ఇది అవసరమని, వ్యవసాయ కాలేజీలో వినూత్న పద్దతులు రావాలని పిలుపునిచ్చారు. కాలేజీ  దారికి సహకరించాలని, ఆ తరువాతనే పని ప్రారంభించాలని, అగ్రికల్చర్ రైతు బిడ్డగా ఇక్కడికి కాలేజీ రావడం సంతోషంగా ఉందని, మార్క్ ఫెడ్ చైర్మన్ గా చేసానని, వ్యవసాయం మీద అవగాహన ఉందని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

అగ్రికల్చర్ మహిళా కాలేజీలో చదివే విద్యార్థినులకు అభినందనలు తెలిపారు. నాలెడ్జ్ లేకుండా చదివితే లాభం లేదని, ఫీల్డ్ ఎక్స్ పీరియన్స్ ఉండాలని, వ్యవసాయం మీద అవగాహన ఉండాలని, తక్కువ నీళ్లతో పంటను పండించే పద్దతులుతో వినూత్న వ్యవసాయాన్ని సృష్టించాలని, మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు, వ్యవసాయ విద్యార్థులు మారాలని పొన్నం  సూచించారు. ఇక్కడ చదువుకొని రైతులకు ఎంతగానో ఉపయోగపడాలని, సెప్టెంబర్ లో వర్షాలు లేకపోవడంతోనే కరువు ఏర్పడిందని, దానికి ఎవరు బాధ్యులు కాదని, కొంత మంది కాంగ్రెస్ కరువు తెచ్చింది అనడం సబబం కాదని హితువు పలికారు, కాంగ్రెస్ పార్టీ వాళ్లు తెచ్చిన కరువు కాదన్నారు. ఈ కార్యక్రమంలో మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులాల కార్యదర్శి సైదులు, జడ్పిటిసి, ఎంపిటిసి ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News