Saturday, December 14, 2024

గుజరాత్ గులాములు మీరు:మంత్రి పొన్నం

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ ఎన్నికల హామీల అమలులో విఫలమైందని విమర్శలు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన విమర్శలను బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ట్విట్టర్ వేదికగా తిప్పికొట్టారు. ఢిల్లీ చెప్పులు మోసే గుజరాత్ గులాములు..హామీలు ఎగ్గొట్టటంలో, అప్పులు తేవడంలో మీరు ప్రపంచ రికార్డు సాధించారని బిజెపి పాలనపై పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. రైతులకు ప్రతి నెల పింఛన్, పేదలకు ఉచిత విద్యుత్, సామాన్యుల ఎకౌంట్లో 15 లక్షల రూపాయలు, రెండు కోట్ల ఉద్యోగాలు, విభజన హామీలు… ఇలా చెప్పుకుంటూ పోతే మీరు ఎగ్గొట్టిన హామీలు చిన్నో పిల్లాడిని అడిగినా చెప్తారని ఎద్దేవా చేశారు. ఇక అప్పుల విషయానికొస్తే.. మీరు తెచ్చిన 150 లక్షల కోట్ల అప్పులు దేశానికి గుదిబండగా మారాయని,

ఏటా మీ అప్పులకు వడ్డీలు కట్టేందుకే 11 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయని విమర్శించారు. పదేండ్ల మీ పాలనలో విద్వేశ ప్రచారం, విధ్వంస చర్యలు తప్ప దేశానికి మీరు చేసింది శూన్యమని, కాని కోతలు, వాతలతో సామాన్యుల నడ్డి విరచడంలో మీరు నిష్ణాతులని పొన్నం మండిపడ్డారు. ఆడబిడ్డల ప్రసూతి ప్రయోజనాల్లో కోత, విద్యార్థుల స్కాలర్షిప్ లలో కోత, వయోవృద్ధుల రైలు ప్రయాణ రాయితీలకు కోత, రేషన్ కార్డుల్లో కోత, ఎరువుల సబ్సిడీలో కోత, గ్యాస్ సబ్సిడీలో కోత, ఉపాధి హామీ నిధుల్లో కోత, ఫసల్ బీమా లో కోత, సెస్ ల పేరుతో సామాన్యుల జేబులకు చిల్లులు, పెట్రోల్ డీజిల్ ధరల వాతలు మీ పాలన వైఫల్యానికి నిదర్శనాలని ఏకరవు పెట్టారు. అటువంటి మీరు 10 నెలల ప్రజా ప్రభుత్వంపై మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని, చేతనైతే తెలంగాణ హక్కులను కాపాడండని, కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రప్పించండని హితవు పలికారు. అంతేకాని అవాకులు చవాకులు పేలితే తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించదు గాక క్షమించదని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News