Saturday, May 4, 2024

ముందు ముచ్చట… ఆ తర్వాతే ముద్దు

- Advertisement -
- Advertisement -

Pragya Jaiswal tells her dating gossip

 

అందాల తార ప్రగ్యా జైస్వాల్ తన డేటింగ్ కబుర్లు చెప్పింది. ఎవరితోనైనా డేటింగ్‌కి వెళ్ళినప్పుడు మొదటిరోజే ముద్దు అడిగితే ఒప్పుకోను అంటోంది. ముందు ముచ్చట… ఆ తర్వాతే ముద్దు అని చెప్పింది ఈ బ్యూటీ. ఒకరికి ఒకరు కొద్దిగా అర్థమై, మనసులు కలిస్తేనే పెదవులు కలిపేందుకు అంగీకరిస్తుందట. ఇలా డేటింగ్ సూత్రాలు తెలిపింది ఈ ముద్దుగుమ్మ. ఇంతకీ ప్రస్తుతం ఎవరితో డేటింగ్ లో ఉందో? ఆ విషయం చెప్పలేదు మరి. ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ తన కెరీర్ పై దృష్టి పెట్టింది. బాలయ్య సరసన ‘అఖండ’ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇది హిట్టయితే ఆమె దశ తిరిగినట్టే. తన అందచందాలతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసే ఈ సుందరి మరో రెండు తెలుగు సినిమాల్లో కూడా అవకాశాలు పొందనుందట. ఆ సినిమాల చర్చలు సాగుతున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News