Friday, May 3, 2024

ఈ నెల 26న చేవెళ్లలో ప్రజా గర్జన సభ

- Advertisement -
- Advertisement -

ఈనెల 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు శాసనసభ నియోజకవర్గాల వారీగా క్షేత్ర స్థాయిలో సమావేశాలు
ఈ నెల 29వ తేదీన మైనార్టీ డిక్లరేషన్
సెప్టెంబర్ 6వ తేదీ లేదా 9వ తేదీన ఓబిసి డిక్లరేషన్ విడుదల
మహిళా డిక్లరేషన్ సభకు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ హాజరు
సోనియాగాంధీ చేతుల మీదుగా సెప్టెంబర్ 17న కాంగ్రెస్ మ్యానిఫెస్టో విడుదల
టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: ఈ నెల 26వ తేదీన సాయంత్రం 4 గంటలకు చేవెళ్లలో ‘ప్రజా గర్జన సభ’ ఉంటుందని, ‘తిరగబడదాం.. తరిమికొడదాం’ అనే నినాదంతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించాలని, దానిని గ్రామ గ్రామాన ప్రజల్లోకి తీసుకెళ్లాలని టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం గాంధీ భవన్‌లో రేవంత్ అధ్యక్షతన టిపిసిసి విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏఐసిసి ఇన్‌చార్జీ మాణిక్‌రావు ఠాక్రే, కార్యదర్శి మన్సూల్ అలీఖాన్, డి.శ్రీధర్‌బాబు, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్, మాజీ పిసిసి చీఫ్ ఉత్తమ్‌కు మార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు నిర్ణయాలను తీసుకున్నామని రేవంత్ ప్రకటించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చేవెళ్ల ప్రజా గర్జనకు ముఖ్య అతిథిగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరవుతారని, ఈ బహిరంగ సభలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ఖర్గే విడుదల చేస్తారని ఆయన చెప్పారు.

ఈనెల 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు శాసనసభ నియోజకవర్గాల వారీగా క్షేత్ర స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశాల్లో భాగంగా ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్కో పిసిసి ఉపాధ్యక్షుడు కో ఆర్డినేటర్లుగా ఉంటారన్నారు. ఈ నెల 29వ తేదీన మైనార్టీ డిక్లరేషన్‌ను వరంగల్‌లో విడుదల చేయాలని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సెప్టెంబర్ 6వ తేదీ లేదా 9వ తేదీన ఓబిసి డిక్లరేషన్ ఉంటుందని, దీనికి కర్ణాటక సిఎం సిద్ధరామయ్య హాజరవుతారన్నారు. ఓబిసి, మహిళా డిక్లరేషన్ల కోసం సబ్ కమిటీని నియమిస్తామని ఆయన వెల్లడించారు. మహిళా డిక్లరేషన్ సభకు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీని ఆహ్వానిస్తామన్నారు. రాహుల్ గాంధీని కూడా తీసుకువస్తా మన్నారు. ఎన్నికల మేనిఫెస్టో విడుదలకు అగ్రనేత సోనియాగాంధీని ఆహ్వానిస్తామన్నారు. ఏఐసిసి ఇన్‌చార్జీ మాణిక్ రావ్ ఠాక్రే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రకటించిన డిక్లరేషన్స్, ఛార్జ్‌షీట్స్, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. కర్ణాటక తరహాలో కాంగ్రెస్ గ్యారెంటీ కార్డులను ఇంటింటికీ చేరేలా చూడాలన్నారు. సెప్టెంబర్ 17వ తేదీన కాంగ్రెస్ మ్యానిఫెస్టోను సోనియాగాంధీ చేతుల మీదుగా విడుదల చేయించాలని పిసిసి నిర్ణయించిందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News