Tuesday, December 6, 2022

‘హనుమాన్’ టీజర్ విడుదల..

- Advertisement -

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, యంగ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘హను-మాన్’. ఈ క్రేజీ పాన్ ఇండియా సినిమా టీజర్ సోమవారం విడుదలైంది. ఒక అద్భుతమైన జలపాతాన్ని చూపిస్తూ టీజర్ ప్రారంభమైంది. జలపాతంకు ఆనుకొని చేతిలో గదతో భారీ హనుమాన్ విగ్రహం కూడా దర్శనమిస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీరామ నామం వినిపించింది. 121 సెకన్ల ఈ టీజర్ విజువల్ వండర్‌గా అంజనాద్రి ప్రపంచంలోకి తీసుకెళ్లింది.

టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో తేజ సజ్జ మాట్లాడుతూ.. “హనుమాన్.. గాలి కంటే వేగంగా ప్రయాణించగలిగిన వారు, బుద్ధిలో శ్రేష్టులు, వానర యోధుల్లో ముఖ్యులు, ఇంద్రియాలని జయించినవారు, సాక్ష్యాత్తు శ్రీరామచంద్రమూర్తి దూత. ఇంతకంటే సూపర్ హీరో మనదగ్గర ఎవరున్నారు. అలాంటి గొప్ప దేవుడు హనుమంతుడి అనుగ్రహంతో ఒక కుర్రాడికి సూపర్ పవర్ వస్తే ఏం చేస్తాడనేది మా ‘హను–మాన్’ చిత్రం”అని అన్నారు.

దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. “హను-మాన్ కేవలం పాన్ ఇండియా సినిమా కాదు పాన్ వరల్డ్ సినిమా. ఎందుకంటే హనుమంతుడు సూపర్ హీరో. బ్యాట్‌మాన్, సూపర్‌మాన్ కంటే పవర్‌ఫుల్ ఎవరంటే హనుమాన్ పేరు చెబుతాం. ట్రైలర్ కంటే సినిమా ఇంకా బావుంటుంది”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో అమృత అయ్యర్‌తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ క్రేజీ పాన్ ఇండియా చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Prasanth Varma’s ‘Hanuman’ Teaser launched

Related Articles

- Advertisement -

Latest Articles