Saturday, July 5, 2025

148 ఏళ్ల టెస్ట్ క్రికెట్‌ చరిత్రలో ప్రసిద్ధ్ అత్యంత చెత్త రికార్డు

- Advertisement -
- Advertisement -

ఇంగ్లండ్‌తో జరుతున్న రెండో టెస్ట్‌లో భారత్ ఆధిక్యం‌లో ఉన్నప్పటికీ.. ఒక విషయంలో మాత్రం తీవ్ర నిరాశకు గురైంది. అది ప్రసిధ్ధ్ కృష్ణ (Prasidh Krishna) బౌలింగే. తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఫర్వాలేదు అనిపించిన ప్రసిద్ధ్ రెండో టెస్ట్‌లో మాత్రం ధారాలంగా పరుగులు సమర్పించుకున్నాడు. 17 ఓవర్లలో 5.50 ఎకానామీతో 72 పరుగులు ఇచ్చాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ బ్యాటర్.. జేమీ స్మిత్ ప్రసిద్ధ్ బౌలింగ్‌లో చితక్కొట్టాడు. 32వ ఓవర్ వేసిన ప్రశిద్ధ్ 4, 6, 4, 4, 4 స్మిత్ బాదాడు. ఒక బంతికి ఎక్స్‌ట్రా పరుగు వచ్చింది.

దీంతో ప్రసిద్ధ్ (Prasidh Krishna) ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో 500 లేదా అంతకంటే ఎక్కువ బంతులు వేసి అత్యధిక ఎకానామీ రేట్ నమోదు చేసిన బౌలర్‌గా ప్రసిద్ధ్ నిలిచాడు. ఈ రికార్డు మరో ఫాస్ట్ బౌలర్ వరుణ్ అరోన్ (4.77) పేరిట ఉండేది. మరోవైపు 2000 సంవత్సరం తర్వాత ఒకే సంవత్సరంలో అత్యధిక పరుగులు ఇచ్చాన భారత బౌలర్ల లిస్ట్‌లో ప్రసిద్ధ్ నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో హర్భజన్ సింగ్(27), మునాఫ్ పటేల్(25), కర్ణ్ శర్మ (24) ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News