Monday, April 29, 2024

మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వాచ్‌మెన్ ప్రవీణ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వాచ్ మెన్‌గా పనిచేస్తున్న ప్రవీణ్ ప్రభుత్వ రంగంలో ఒకేసారి మూడు ఉద్యోగాలు సాధించిన కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు. 10 రోజుల వ్యవధిలోనే మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించారు. ఇటీవలే తెలంగాణ గురుకుల విద్యాలయాల బోర్డు ప్రకటించిన ఫలితాల్లో టిజిటి, పిజిటి, జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు ఉత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నాడు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొన్కల్ గ్రామానికి చెందిన ప్రవీణ్ ప్రాధమిక విద్య నుంచి డిగ్రీ వరకు జెన్నారంలో పూర్తి చేశారు. తండ్రి పెద్దులు మేస్త్రీ పని చేస్తుండగా తల్లి పోసమ్మ బీడీ కార్మికురాలిగా పని చేస్తు చదివించింది.

తల్లిదండ్రులు కష్టాన్ని చూసి ఉన్నత ఉద్యోగం సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఎంకాం, బిఈడి, ఎంఈడి ఓయూ క్యాంపస్‌లో చదుపుకున్నారు. ఖర్చుల కోసం ఈ ఎమ్మార్సీలో ఐదేళ్లుగా వాచ్‌మెన్ గా ఉద్యోగం చేస్తూనే పోటీ పరీక్షలకు సిద్దమయ్యాడు. అతని పట్టుదల, కష్టం ఫలించి ఒకే సారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. ప్రవీణ్ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించటం పట్ల ఈఎమ్మార్సీ డైరెక్టర్, ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. అతని స్పూర్తితో పేదరికం జయించేందుకు విద్యార్థులు, యువత ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌ను ఈఎమ్మార్సీ ఉద్యోగులు సన్మానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News