Wednesday, May 21, 2025

ఆ ఫోటోలో ఉంది నేను కాదు..: క్లారిటీ ఇచ్చిన ప్రీతి జింటా

- Advertisement -
- Advertisement -

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌‌లో 11 సంవత్సరాల తర్వాత పంజాబ్ కింగ్స్ జట్టు ప్లేఆఫ్స్‌కి చేరుకుంది. ఈ నెల 18వ తేదీన రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన పంజాబ్ ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించింది. అయితే ఈ మ్యాచ్ తర్వాత పంజాబ్ కో-ఓనర్ ప్రీతి జింటా (Preity Zinta).. రాయల్స్‌లోని యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీని హగ్ చేసుకున్నట్లు ఓ ఫోటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే ఈ ఫోటోపై ప్రీతి క్లారిటీ ఇచ్చారు. ఆ ఫోటోలో ఉంది తాను కాదని అది ఒక మార్ఫింగ్ ఫోటో అని ఆమె తెలిపారు. ఫోటోలో ఉంది ప్రీతినే అంటూ పలు వెబ్‌సైట్లు కథనాలు రాయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానిజాలు తెలుసుకోకుండా ఇలా అబద్దాలను ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదని ఆమె మండిపడ్డారు. ఓ వెబ్‌సైట్ తన మార్ఫింగ్ ఫోటోని ఉపయోగిస్తూ.. వార్త రాయడం చూసి షాక్ అయినట్లు పేర్కొన్నారు. దీంతో పంజాబ్ కో-ఓనర్ అయిన ప్రీతి (Preity Zinta).. ప్రత్యర్థి జట్టు ఆటగాడితో అలా ఎందుకు ప్రవర్తిస్తారు అని సోషల్‌మీడియాలో మొదలైన చర్చకు ఫుల్‌స్టాప్ పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News