Sunday, September 15, 2024

ద్రౌపది ముర్ముకు ఫిజీ పౌర పురస్కారం ప్రదానం

- Advertisement -
- Advertisement -

ఫిజీ దేశ అత్యున్నత పౌర పురస్కారం ది కంపేనియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం స్వీకరించారు. ఫిజీ అధ్యక్షుడు రటు విలియం మైవలిలి కటొనివెరె ఈ పురస్కారాన్ని ముర్ముకు ప్రధానం చేశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఫిజీని సందర్శించిన ముర్ము తనకు అభించిన పురస్కారం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. భారత్, ఫిజీ మధ్య బలమైన స్నేహసంబంధాలను ఈ అవార్డు ప్రతిబింబిస్తోందని ఆమె తెలిపారు. ఉభయ దేశాల మధ్య కొనసాగుతున్న బంధాలను ఆమె ప్రస్తుతిస్తూ ఫిజీని మరింత సుసంపన్నంగా తీర్చిదిద్దడానికి భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. రెండు దేశాల ప్రజలకు మరిన్ని ప్రయోజనాలను చేకూర్చే విధంగా భారత్, ఫిజీ మధ్య భాగస్వామ్యం మరింత బలపడాలని ఆమె ఫిజీ పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News