Wednesday, May 14, 2025

ప్రధాని మోదీ అదంపూర్ పర్యటన.. తేటతెల్లమైన పాకిస్తాన్ అబద్ధపు ప్రచారం

- Advertisement -
- Advertisement -

చెక్కుచెదరని ఎస్ -400 వైమానిక రక్షణవ్యవస్థ
మిగ్ -20 జెట్ విమానశ్రేణి నేపథ్యంలో ప్రధాని

న్యూఢిల్లీ:  ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం నాడు పంజాబ్ లోని అదంపూర్ లోని వైమానిక స్థావరాన్ని ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ ఒక వైపు మిగ్ -29 జెట్, ఎస్ -400 వైమానిక రక్షణ వ్యవస్థ నేపథ్యంలో నిలచిన ప్రధాని మోదీ ఫోటో, పాక్ తప్పుడు ప్రచారాన్ని కుప్పకూల్చింది. ప్రధాని వైమానిక రక్షణ వ్యవస్థవద్ద జవాన్లను అభినందిస్తూ వారివైపు చేయి ఊపుతూ కనిపించారు. వైమానిక స్థావరానికి ఎటువంటి నష్టం జరగలేదని ఈ ఫోటోలు తేటతెల్లం చేశాయి. అదంపూర్ లో ప్రధాని పర్యటనతో పాకిస్తాన్ తన జెఎఫ్ -17 ఫైటర్ జెట్ లద్వారా ప్రయోగించిన క్షిపణులు అదంపూర్ ఎస్ -400 వైమానిక రక్షణ వ్యవస్థనను నాశనం చేశాయనే వాదనను ఖండించినట్లయింది. అంతే కాకా, జాతీయ భద్రత పట్ల మోదీ అచంచలమైన నిబద్ధత రుజువయింది.

పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లో టెర్రరిస్ట్ శిబిరాలపైన, సైనిక స్థావరాలపైనా భారతదేశం తన దాడి నిలిపివేసిందని భారత్ స్పష్టమైన సందేశం పంపిన మర్నాడే ప్రధాని మోదీ భారతదేశంలోని రెండో అతిపెద్ద వైమానిక స్థావరమైన అదంపూర్ ను సందర్శించడం విశేషం. ఉదయాన్నే అదంపూర్ చేసుకున్న ప్రధాని పాక్ డ్రోన్, క్షిపణులను అడ్డుకుంటూ , యుద్ధరంగంలో ఉన్న వైమానిక దళ సిబ్బందితో సంభాషించారు. త్రివిధ దళాలు ధైర్యం, దృఢసంకల్పం, నిర్భయానికి ప్రతీకగా నిలవడం ప్రత్యేకమైన అనుభవం అని ప్రధాని అన్నారు. దేశం కోసం మన సాయుధ దళాలు చేసిన కృషికి భారత దేశం వారికి ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటుందని మోదీ ట్వీట్ చేశారు. గతవారం భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ డ్రోన్లు, క్షిపణులతో వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకునే యత్నం చేసింది. రష్యాలో తయారైన ఎస్- 400, వైమానిక రక్షణవ్యవస్థ, భారతదేశపు సుదర్శన చక్ర ఆ క్షిపణులను చిత్తుచేశాయి.

పాక్ తప్పుడు ప్రచారం నకిలీ వీడియోలు అదంపూర్ లో తన డ్రోన్లు, క్షిపణులు విఫలమైన తర్వాత, పాకిస్తాన్ నకిలీ వీడియోలను తయారు చేసి, వైమానిక స్థావరాన్ని దెబ్బతీసినట్లు తప్పుడు ప్రచారం చేసుకుంది. మట్టిదిబ్బల ఫోటోలు విడుదల చేసి, అవి ఎయిర్ బేస్ వద్ద దెబ్బతిన్న ఎస్- 400 కు చెందిన ఉపగ్రహచిత్రాలు అంటూ ప్రచారం చేసింది
. ఆ చిత్రాలలోశిథిలాలు కానీ, దెబ్బతిన్న పరికరాలు కానీ కన్పించలేదు. పాకిస్తాన్ వాదనను భారత సైన్యం తోసిపుచ్చినా, సోషల్ మీడియాలో పాక్ నకిలీ చిత్రాలప్రచారానికే తొందరపడింది. ప్రధాని మోదీ పోస్ట్ చేసిన చిత్రాలలో కూడా ఎక్కడా ఎయిర్ బేస్ కానీ, రన్ వే కు కానీ ఎలాంటి నష్టం కలగలేదని స్పష్టమైంది. ఆ చిత్రాలపై నిజనిర్థారణలో మాస్టర్ అని నిపుణులు ప్రశంసించారు.

అదంపూర్ కు ఘన చరిత్ర

అదంఫూర్ వైమానిక స్థావరం గతంలో పాకిస్తాన్ తో జరిగిన ఘర్షణల్లో కీలకంగా నిలిచింది. 1965 ఇండో -పాక్ యుద్ధంలో భారతసైన్యానికి ఆయువుపట్టుగా నిలిచింది, సరిహద్దుకు కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్థావరం వ్యూహాత్మక మైనది. వైమానిక రక్షణ పెట్టని కోట. ఈ స్థావరంలో సు-7, మిగ్ 21 వంటి కీలకవిమానాలు , క్షిపణి, రాడార్ యునిట్ లు ఉన్నాయి. 2022లో అదంపూర్ వైమానిక స్థావరంలో ఎస్-400, తో పాటు మిగ్ -29, సు-30 యుద్ధ విమానాలకు నిలయంగా ఉంది..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News