Tuesday, October 15, 2024

బ్రిడ్జి పైనుంచి కిందపడిన బస్సు: ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

ముంబయి: మహారాష్ట్రలోని అమరావతి జిల్లా పరాట్వాడిధని రూట్‌లో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సెమడోహ ప్రాంతంలో మేల్‌ఘాట్ బ్రిడ్జి పైనుంచి బస్సు పడిపోవడంతో ఆరుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, ప్రభుత్వ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆరోగ్య కేంద్రాలకు తరలించామని అమరావతి కలెక్టర్ సౌరభ్ కటియార్ తెలిపారు. గాయపడిన వారిలో ముగ్గురిని పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. చావ్లా ట్రావెల్స్ కంపెనీకి చెందిన బస్సుగా గుర్తించామని పోలీసులు తెలియజేశారు. బస్సు అదుపుతప్పి పడిపోయినట్టు గుర్తించామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News