Wednesday, November 6, 2024

వయనాడ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ప్రియాంక గాంధీ..

- Advertisement -
- Advertisement -

కేరళ: వయనాడ్ లోక్ సభ అభ్యర్థిగా కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులతో కలిసి వెళ్లి ఆమె నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

కాగా ప్రియాంక గాంధీ తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ.. వయనాడుతోపాటు రాయ్ బరేలీ నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే, ఆయన వయనాడు స్థానానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేయడంతో కాంగ్రెస్ పార్టీ, ప్రియాంక గాంధీని బరిలో దింపుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News