Sunday, April 28, 2024

బిజెపిపై విరుచుకుపడిన ప్రియాంక

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వంలో రాజకీయ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బిజెపి)పై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ధన బలం, కేంద్ర సంస్థలను దుర్వినియోగం ద్వారా ప్రజల తీర్పును బిజెపి ‘అణచివేయాలని’ చూస్తోందని ప్రియాంక ఆరోపించారు. రాష్ట్రాన్ని ‘రాజకీయ విపత్తు’ దిశగా నెట్టేందుకు బిజెపి యత్నిస్తోందని కూడా ఆమె ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో సాధారణ ప్రజలకు తమకు ఇష్టమైన ప్రభుత్వాన్ని ఎంచుకునే హక్కు ఉందని ప్రియాంక చెప్పారు. 2022లో హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆమె కీలక పాత్ర పోషించడమే కాకుండా రాష్ట్రంలోని పార్టీ వ్యవహారాల్లో సంబంధం కలిగి ఉన్నారు. ‘హిమాచల్ ప్రజలు ఈ హక్కును వినియోగించుకుని స్పష్టమైన ఆధిక్యంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

కానీ, ధన బలాన్ని, కేంద్ర సంస్థల అధికారాన్ని, కేంద్రం అధికారాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా హిమాచల్ ప్రజల ఈ హక్కు అణచివేతకు బిజెపి ప్రయత్నిస్తోంది’ అని ప్రియాంక ‘ఎక్స్’లో హిందీ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇందు కోసం ప్రభుత్వ భద్రత, ఇతర యంత్రాంగాన్ని బిజెపి వినియోగిసస్తున్న తీరు దేశ చరిత్రలో కని విని ఎరగనిది అని ఆమె అన్నారు. 25 మంది ఎంఎల్‌ఎలు ఉన్న పార్టీ 43 మంది ఎంఎల్‌ఎల ఆధిక్యాన్ని సవాల్ చేస్తున్నదంటే ప్రతినిధుల కొనుగోలుపై అది ఆధారపడిందని స్పష్టంగా విదితం అవుతోందని ప్రియాంక వ్యాఖ్యానించారు. ‘వారి (బిజెపి) దృక్పథం అనైతికం, రాజ్యాంగవిరుద్ధం. హిమాచల్, దేశ ప్రజలు సర్వం చూస్తున్నారు. ప్రకృతి వైపరీత్యం సమయంలో రాష్ట్ర జనానికి అండగా నిలవని బిజెపి ఇప్పుడు రాష్ట్రాన్ని రాజకీయ విపత్తు దిశగా నెడుతున్నది’ అని ప్రియాంక విమర్శించారు.

ఇది ఇలా ఉండగా, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సిమ్లాకు ముగ్గురు పరిశీలకులు భూపేష్ బాఘెల్, భూపిందర్ సింగ్ హూడా, డికె శివకుమార్‌లను పంపినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్విని తమ అభ్యర్థి హర్ష్ మహాజన్ ఓడించడంతో రాష్ట్రంలోని ఏకైక రాజ్యసభ సీటును బిజెపి కైవసం చేసుకొనడంతో ఈ సంక్షోభానికి తెర లేచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News