Sunday, April 28, 2024

నిపుణుల సూచన మేరకే మేడిగడ్డపై ముందుకు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : గోదావరి నదిపై నిర్మించిన మేడిగడ్డ బ్యారేజి కుంగిపోయి బీటలు వారిన ఘటనలో దాని భవితవ్యాన్ని తేల్చేందుకు ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి వెల్లడించారు. అసెంబ్లీలో నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన మంత్రి చర్చ ముగింపులో కీలక ప్రకటన చేశారు. మేడిగడ్డ బ్యారేజి ఘటనలో నిపుణుల కమిటి అన్ని కోణాలనుంచి సమగ్రంగా అధ్యయనం చేస్తుందన్నారు.

ఈ కమిటీ నివేదిక ఇచ్చాక దాన్ని పరిశీలించి ఏవిధంగా ముందుకు పోవాలో ప్రభుత్వం నిర్ణయిస్తుంని తెలిపారు. అప్పటివరకూ బ్యారేజిలో నీటిని నిలువ చేసే అవకాశం లేదన్నారు. ఈ ఏడాది ప్రభుత్వం నిర్మాణంలో ఉన్న కొన్ని ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించుకుందని తెలిపారు. ఈ ప్రాజెక్టుల్లో పెండింగ్ పనులు పూర్తి చేయటం ద్వారా ఈ ఏడాది కొత్తగా ఏడు లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News