Sunday, July 14, 2024

కంటెంట్ బాగున్న సినిమాలు తప్పకుండా హిట్

- Advertisement -
- Advertisement -

సినిమా మీద ఇష్టం ఏర్పడితే అది మనం ఏ వృత్తిలో ఉన్నా ఫిలిం ఇండస్ట్రీ వైపే ఆకర్షిస్తుంటుంది. అలా సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా విదేశాల్లో ఉంటూ నిర్మాతగా, ఫైనాన్షియర్ గా సినిమాల మీద తనకున్న ప్యాషన్ చూపిస్తున్నారు శింగనమల కల్యాణ్. తన సినీ వ్యాలీ మూవీస్ లో ఈ ఇయర్ భాగ్ సాలే సినిమాను నిర్మించిన శింగనమల కల్యాణ్…దాము రెడ్డితో కలిసి గరుడ ప్రొడక్షన్స్, పింగో పిక్చర్స్ పార్టనర్ షిప్ లో ప్రొడ్యూస్ చేస్తున్న కొత్త సినిమా రాక్షస కావ్యం. అభయ్ నవీన్, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను దర్శకుడు శ్రీమాన్ కీర్తి రూపొందించారు. అక్టోబర్ 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా “రాక్షస కావ్యం” సినిమా విశేషాలు, తన కెరీర్ జర్నీ గురించి చెప్పారు నిర్మాత శింగనమల కల్యాణ్

చిన్నప్పటి నుంచి మూవీస్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది. వృత్తిపరంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నా..సినిమా ఇండస్ట్రీ మీద ఇష్టం తగ్గలేదు. యూరప్, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో పనిచేశాను. గత 15 ఏళ్లుగా అమెరికాలో సాఫ్ట్ వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ఒకరోజు ప్రొడ్యూసర్ దాము రెడ్డిని మధుర శ్రీధర్ రెడ్డి నా దగ్గరకు తీసుకొచ్చాడు. “రాక్షస కావ్యం” సబ్జెక్ట్ బాగుంది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రా అండ్ రస్టిక్ మూవీ అని చెప్పాడు. సినిమా స్టోరీ లైన్ నచ్చింది. అలా “రాక్షస కావ్యం” మూవీ ప్రొడక్షన్ లో అడుగుపెట్టాను.

“రాక్షస కావ్యం” సినిమా కథ సహజంగా ఉంటూ..రా అండ్ రస్టిక్ గా సాగుతుంది. ఎక్కువ మెలోడ్రామా చూపించడం లేదు. మనం రియల్ లైఫ్ లో చూసేదానికి దగ్గరగా ఉంటుంది. ముఖ్యంగా దిగువ మధ్య తరగతికి చెందిన మనుషులు, బస్తీల్లో ఉండేవాళ్ల మైండ్ సెట్, జీవన విధానం మూవీలో కనిపిస్తుంది. అక్కడ తాగుడుకు బానిసై పిల్లలను చదివించకుండా పనికి పంపిస్తుంటారు. ఈ కథలో విలన్స్ గెలవాలి. ఎప్పుడూ హీరోలే ఎందుకు గెలవాలి అనే కామెడీ పాయింట్ కూడా కొత్తగా ఉంటుంది. మన సినిమాల్లో విలన్స్ ను ఎలా తక్కువ చేసి చూపిస్తున్నారు…హీరోలను ఎలా హైప్ చేస్తున్నారు అని చెప్పే సరదా సీన్స్ కూడా ఉంటాయి.

“రాక్షస కావ్యం” కథకు పురాణాల్లోని ఓ సందర్బం రిలేట్ అయి ఉంటుంది. ఒక రుషి కైలాసగిరికి వస్తున్నప్పుడు ఇద్దరు ద్వారపాలకులకు అడ్డుకుంటారు. ఆ రుషి ఆగ్రహించి శపిస్తాడు. మీ దేవుడికి భక్తులుగా పుట్టి పది జన్మలు ఎత్తుతారా? లేక దేవుడికి శత్రువులుగా పుట్టి మూడు జన్మలు ఎత్తుతారా? అని అడుగుతాడు. అప్పుడు ఆ ద్వారపాలకులు మా దేవుడిని చూడకుండా ఉండలేం. రాక్షసులుగా మూడు జన్మల్లో పుడతాం అని అంటారు. అలా జన్మించిన వారే రామాయణంలో రావణాసురుడు, కుంభకర్ణుడు, మహాభారతంలో శిశుపాలుడు, కంసుడు..ఆ కాలంలోని ఇద్దరు ద్వారపాలకులు…కలియుగంలో ఆ ఇద్దరు మళ్లీ పుట్టారు అనేది పోలిక. వీళ్లిద్దరిలో ఒకరు హీరోల కంటే విలన్స్ ను ఇష్టపడతాడు. మరొకరు రాక్షసంగా అందర్నీ చంపే రౌడీగా కనిపిస్తాడు.

కథను చెప్పినదానికంటే బాగా తెరకెక్కించాడు దర్శకుడు శ్రీమాన్. ఎలాంటి ఫాంటసీ, మెలోడ్రామా, ఫారిన్ లొకేషన్స్ షూట్స్ లేకుండా..సహజంగా మనం బస్తీల్లో చూసే వ్యక్తుల జీవితాలను రా అండ్ రస్టిక్ గా రూపొందించాడు. ఇవాళ నెగిటివ్ క్యారెక్టర్స్ ను ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. అందుకు పుష్ప, కేజీఎఫ్ లాంటి సినిమాల సక్సెస్ నిదర్శనం. హీరో బుద్ధుడిలా ఉంటాడంటే ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది. అలాంటి ట్రెండ్ ఇప్పుడు నడుస్తోంది. అందుకే మా ట్రైలర్ రిలీజ్ లో దిల్ రాజు గారు చెప్పింది కరెక్ట్.

“రాక్షస కావ్యం” లో అన్వేష్ కామెడీ బాగా చేశాడు. అతని క్యారెక్టర్ తో ప్రేక్షకుల్ని నవ్విస్తాడు. అభయ్ ది సీరియస్ క్యారెక్టర్. రౌడీ క్యారెక్టర్ చేశాడు. ఇద్దరూ తమ క్యారెక్టర్స్ లో బాగా పర్ ఫార్మ్ చేశారు. అక్టోబర్ 6న మా సినిమాను రిలీజ్ చేస్తున్నాం. ఆ వీక్ పెద్ద సినిమాలు లేవు కాబట్టి థియేటర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. మా సినిమాకు కరెక్ట్ డేట్ అనుకుంటున్నాం.

మా సినీ వ్యాలీ మూవీస్ లో ఇకపై వరుసగా సినిమాలు చేయబోతున్నాం. ప్రస్తుతం టాంగా ప్రొడక్షన్స్ అధినేత విజయ్ మట్టపల్లి భాగస్వామ్యంతో మా సంస్థ నిర్మిస్తున్న ప్రేమ కథ అనే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి దశలో ఉంది. నవంబర్ లో రిలీజ్ కు రెడీ చేస్తున్నాం. మరో మూవీ కూడా క్రిస్మస్ కు లేదా జనవరిలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఆ సినిమా ఆమెరికాలో లాస్ ఎంజెలీస్ లో షూట్ చేశాం. మా సంస్థలో సంజీవ్ రెడ్డి డైరెక్షన్ లో చైతన్య రావ్ హీరోగా ఓ కొత్త సినిమాను అక్టోబర్ లో ప్రారంభించబోతున్నాం. నెక్ట్ ఇయర్ లేదా ఆ తర్వాత ఇయర్ కల్లా మా ప్రొడక్షన్ లో స్టార్ హీరోలతో భారీ మూవీస్ నిర్మించాలనే ప్లాన్ ఉంది. కొందరు స్టార్ హీరోస్ ను అప్రోచ్ అవుతున్నాం.

చిన్న సినిమాలకు ప్రొడక్షన్ రిస్క్ గానే ఉంది. కోవిడ్ టైమ్ లో ఓటీటీల వల్ల చిన్న సినిమాలకు లాభం చేకూరింది. కానీ ఇప్పుడు ఓటీటీలకు ఇవ్వాలంటే కష్టంగా ఉంది. పెద్ద సినిమాలు ఎప్పుడూ సేఫ్ జోన్ లోనే ఉంటాయి. కంటెంట్ బాగుండి, కొత్త కథలతో ఆకట్టుకుంటే తప్ప ప్రేక్షకులు థియేటర్స్ కు రావడం లేదు. కంటెంట్ బాగుండి, మౌత్ టాక్ స్ప్రెడ్ అయిన బేబి లాంటి మూవీస్ హిట్ అవుతున్నాయి. సినిమా బాగుంటే ఓపెనింగ్స్ రాకున్నా తర్వాత కలెక్షన్స్ బాగుంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News