Sunday, August 24, 2025

ప్రజా వాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: ప్రజా వాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు తక్షణమే పరిష్కరించాలని డిఆర్‌ఓ నగేష అన్నారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా వాణిలో జిల్లాలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజల నుండి డిఆర్ నగేష దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా డిఆర్‌ఓ మాట్లాడుతూ ప్రజావాణిలో ప్రజలు తెలిపిన సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపి సమస్యలు లేకుండా చూడాలన్నారు.

ప్రజా వాణిలో మొత్తం 29 దరఖాస్తులు, రాగా అందులో 12 రెవెన్యూ శాఖ సంబంధించినవి కాగా, మిగతా 17 గృహలక్ష్మి డబుల్‌బెడ్ రూం ఇళ్లు, దళిత బంధు, పెన్షన్‌లు, ఉపాధి, బిసి కుల వృత్తులకు లక్ష రుపాయల ఆర్థిక సహాయం రుణం మంజూరు తదితరాలపై ప్రజలు దరఖాస్తులు అందజేశారని డిఆర్‌ఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News