Saturday, September 30, 2023

ముంబైలో ఎయిర్‌హోస్టెస్ దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

ముంబై : స్థానిక శివారు ప్రాంతం అంధేరిలోని తన ఫ్లాట్‌లో పాతికేళ్ల ట్రైనీ ఎయిర్‌హోస్టెస్ దారుణ హత్యకు గురయ్యారు. గొంతుకోసి చంపినట్లు నిర్థారణ అయింది. ఆదివారం సాయంత్రం కానీ రాత్రి కానీ ఆమె చనిపోయినట్లు నిర్థారించారు. ఎయిరిండియాలో ఎయిర్‌హోస్టెస్ ఉద్యోగానికి ఎంపికైన రూపాల్ ఒగ్రే ఈ ఏడాది ఎప్రిల్‌లో తన నివాసాన్ని ముంబైకి మార్చింది. శిక్షణ పొందుతోంది. అంధేరీలోని మరోల్ కృష్ణన్‌లాల్ మార్వా మార్గ్‌లోని ఎన్‌జి కాంప్లెక్స్ హౌసింగ్ సొసైటికి చెందిన ఫ్లాట్‌లో ఆమె తన సోదరి, ఆమె బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి నివాసం ఉంటోంది. వీరిద్దరూ ఇటీవలే తమ స్వస్థలాలకు వెళ్లారు. ఆదివారం సాయంత్రం నుంచి ఆమె తమ ఫోన్‌కాల్స్‌కు ఎంతకూ సమాధానం ఇవ్వకపోవడంతో రూపాల్ కుటుంబ సభ్యులు ముంబైలో తమకు తెలిసిన వాళ్లకు విషయం చెప్పారు.

దీనితో వారు ఫ్లాట్‌కు వెళ్లి చూడగా లోపలి నుంచి తాళం వేసి ఉంది. దీనితో వారికి ఏదో జరిగిందనే అనుమానం తలెత్తడంతో పోలీసులకు సమాచారం అందించారు.వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించి చూడగా ఎయిర్‌హోస్టెస్ రూపాల్ నెత్తుటి మడుగులో పడి , చనిపోయి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే సొసైటీలోని సెక్యూరిటీ కెమెరాల వీడియో ఫుటేజ్‌లను పరిశీలించారు. తరువాత ఘటనకు సంబంధించి సొసైటీలో స్వీపర్‌గా పని చేసే 40 ఏండ్ల విక్రమ్ అత్వాల్‌ను పోలీసులు వెంటనే అరెస్టు చేశారు. విక్రమ్‌ను ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్నారు. ఈ హౌస్‌కీపర్ భార్య కూడా ఈ సొసైటీలోనే పనిమనిషిగా ఉంది. మొత్తం 12 పోలీసు బృందాలను నిందితుడిని పట్టుకునేందుకు ఏర్పాటు చేశారు. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడి భార్యను కూడా పోలీసులు విచారిస్తున్నారు.

నిందితుడు పదునైన ఆయుధంతో రూపాల్ గొంతుపై దాడికి దిగినట్లు, దీనితో ఆమె తీవ్రంగా గాయపడి చనిపోయినట్లు తెలుస్తోందని పోలీసు డిప్యూటీ కమిషనర్ దత్తా నల్వాడే తెలిపారు. భౌతికకాయాన్ని పోస్టు మార్టానికి పంపించారు. ఈ ఘటనలో లైంగిక దాడి జరిగినట్లు ప్రాధమికంగా ఎటువంటి నిర్థారణ జరగలేదని వైద్యుల నివేదికతో స్పష్టం అయింది. ఎయిర్‌హోస్టెస్ హత్యకేసును పోలీసులు పెద్ద ఎత్తున, పలు కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా కొద్ది రోజుల క్రితం రూపాల్‌కు ఏదో విషయంపై పెద్ద ఎత్తున గొడవ జరిగినట్లు స్థానికులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News