న్యూఢిల్లీ: పంజాక్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)విదేశీ ఆటగాళ్లనుద్దేశించి సోషల్ మీడియాలో పెట్టిన ఓ వీడియో పోస్ట్ వైరల్‌గా మారింది. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య తలెత్తిన యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఐపిఎల్ అర్ధాంతరంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. పరిస్థితులు మళ్లీ మాములుగా మారడంతో శనివారం నుంచి ఐపిఎల్ పునఃప్రారంభమైంది. ఐపిఎల్ తిరిగి ప్రారంభమైనప్పటికీ విదేశీ క్రికెటర్లు ఈ టోర్నమెంట్‌లో పాల్గొనడంపై సందేహం నెలకొంది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్ల మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ జరుగనున్న నేపథ్యంలో ఈ దేశాలకు చెందిన ఆటగాళ్లు ఐపిఎల్ రెండో దశలో పాల్గొనడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఇలాంటి స్థితిలో శ్రేయస్ అయ్యర్ పెట్టిన ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. శ్రేయస్ పోస్ట్‌ను పంజాబ్ కింగ్స్ తన ఎక్స్ ఖాతాలో పెట్టింది. ఈ వీడియో పోస్ట్ ద్వారా శ్రేయస్ విదేశీ క్రికెటర్లకు ఓ చక్కటి సందేశం ఇచ్చాడు.
వైరల్‌గా మారిన శ్రేయస్ సందేశం
- Advertisement -
- Advertisement -
- Advertisement -