- Advertisement -
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా చిదంబరం స్టేడియం వేదికగా.. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 19.2 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌటైంది. చెన్నై బ్యాటర్లలో సామ్ కరన్(88; 47 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్ లు) అదరగొట్టాడు. డెనాల్ట్ బ్రెవిస్(32) ,ధోని (11) పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ 19 ఓవర్ లో నాలుగు వికెట్లు పడగొట్టగా ఇందులో హ్యాట్రిక్ ఉంది. అర్షదీప్ 2, మార్కో యాన్సెస్ 2, ఒమర్జాయ్ , హర్ ప్రీత్ బ్రార్ చెరో వికెట్ తీశారు.
- Advertisement -