Thursday, May 1, 2025

చెన్నైపై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా చిదంబరం స్టేడియం వేదికగా.. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సిరీస్‌లో చెన్నై గతంలో ఎన్నడూ లేనంత చెత్త ప్రదర్శన చేస్తోంది. ఆడిన 9 మ్యాచుల్లో కేవలం 2 మ్యాచుల్లోనే విజయం సాధించి.. పాయింట్స్ టేబుల్‌లో చివరిస్థానంలో ఉంది. ఇప్పటికే ప్లేఆఫ్స్ ఆశలను దాదాపు దూరం చేసుకున్న చెన్నైకి ఇది చావోరేవో తేల్చుకొనే మ్యాచ్‌. ఇక పంజాబ్ జట్టు ఈ సీజన్‌లో ఫర్వాలేదనిపించే ప్రదర్శన చేస్తోంది. 9 మ్యాచుల్లో 5 మ్యాచుల్లో గెలిచి మూడింటిలో ఓటమిపాలైంది. ఒక మ్యాచ్‌ వర్షార్పణం అయింది. దీంతో 11 పాయింట్లతో టేబుల్‌లో ఐదో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News