Monday, October 14, 2024

మోడీని నిలదీయండి

- Advertisement -
- Advertisement -

కృష్ణా జలాల్లో మన వాటా ఎంతో తేల్చండి

రాష్ట్ర బిజెపి నేతలకు ముఖ్యమంత్రి కెసిఆర్ సవాల్

రెండు రాష్ట్రాలకు నీళ్లు పంచమని ప్రధాని చేత ట్రిబ్యునల్‌కు లేఖ రాయించండి

పదేళ్లయినా వాటా తేల్చని విశ్వగురు మోడీ

కృష్ణా జలాలపై కొత్త ట్రిబ్యునల్‌కు సిఫారసు చేయించాలి

వాటా కోసం సుప్రీంకు వెళ్తే… కేసు ఉపసంహరించుకుంటే ట్రిబ్యునల్ వేస్తామంది
ఇంతవరకూ అతీగతిలేదు.. మోడీ కుయ్‌మనడు..కయ్ మనడు
మా వాటా ఎంతో తేల్చమని ఎపిని అడుగుతున్నా

బాజప్తా ఆ జలాలను తీసుకొని మా బతుకేదో బతుకుతాం

నార్లాపూర్‌లో పాలమూరు-రంగారెడ్డి మొదటి పంపు ప్రారంభోత్సవంలో సిఎం

నా జన్మ ధన్యం

పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందినప్పుడు
నా హృదయం ఎంతగా పొంగిపోయిందో.. మళ్లీ ఇప్పుడు
పాలమూరు మోటరు నీళ్లు పోస్తుంటే అంతగా ఉప్పొంగి పోతున్నది.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించడంతో నా జన్మ ధన్యమైంది. ఇవ్వాళ్ల పాలమూరు పంపు పొంగుచూస్తే ఓ నది పారినట్లుగా.. కృష్ణమ్మ తాండవం చేసినట్లుగా.. మనసు పులకరించే అద్భుతమైన ఘట్టాన్ని నా కళ్లతో చూసి నా ఒళ్లంతా పులకరించిపోయింది. మహబూబ్‌నగర్ కీర్తి కిరీటంలో ఈ ప్రగతి చిరస్థాయిగా నిలిచిపోతుంది. మహబూబ్‌నగర్ ఎంపిగా ఉన్నప్పుడే స్వరాష్ట్రం సాధించా. అందుకే పాలమూరు ఎప్పుడూ నా గుండెల్లో నిరంతరం ఉంటుంది. పాలమూరు ఎప్పుడూ నా గుండెల్లో ఉంటది.

ఇంటి దొంగలే ప్రాణగండం

కాళేశ్వరం, సీతారామ, పాలమూరు-రంగారెడ్డి పూర్తయితే తెలంగాణ బంగారు తునకైతదని పనులు చేపట్టినం. కాళేశ్వరం పూర్తయింది. సీతారామను పూర్తిచేసుకుంటున్నాం. పాలమూరు పనుల్లోనే జాప్యం జరిగింది. ఇక్కడి గత్తరబిత్తిరి రాజకీయ నాయకులు దద్దమ్మలే ఇందుకు కారణం. సమైక్య రాష్ట్రంలోపదవులకు ఆశపడి సిఎంలను నీళ్లు అడగని చవటలు పాలమూరుకు అడుగడుగునా అడ్డంకులు కల్పించారు. ఇంటి దొంగలే ప్రాణగండమైనారు. అయినా దృఢ సంకల్పంతో వాటిని ఛేదించి ముందుకు సాగుతున్నాం.

20లక్షల ఎకరాల్లో సాగే లక్ష్యం

జిడిపి, తలసరి ఆదాయంలో నేడు దేశంలోనే మనం నెంబర్ వన్‌గా పురోగమిస్తున్నాం. ఈ పురోగమనం ఇంతటితో ఆగకూడదు. మనం దుఃఖపడ్డనాడు మన కష్టాలు తీర్చేందుకు ఎవడూ రాలేదు.
ఉద్యమ సమయంలో దుందుబి నది దుమ్ము కొట్టుకొని పోతుండేది. దీంట్లో నీరు పారుతున్నదంటే తెలంగాణ తెచ్చుకున్న ఫలితమే. దొంగ నాయకులతో తస్మాత్ జాగ్రత్త. అలసత్వం వహిస్తే వైకుంఠపాళిలో పెదపాము మింగనట్టైతది అయ్యిందానికే సంతోషపడుడు కాదు. ఇంకా బ్రహ్మాండంగా బాగుపడాలి. 20 లక్షల ఎకరాల్లో పసిడి పంటలు పండే పాలమూరు జిల్లా కావాలి. అది మన లక్ష్యం.

కరువు నేలను ముద్దాడిన కృష్ణమ్మ

మన తెలంగాణ/ నాగర్‌కర్నూల్ ప్రతినిధి: సాగునీటి చరిత్రలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. కరువుతో కన్నీరు పెట్టిన పాలమూరు నేలలో సాగు పండుగ వ చ్చిందని జనం సంబుర సంబురపడ్డారు. తెలంగాణ సాగునీటి రంగ పితామహుడు, అపర భగీరథుడు ము ఖ్యమంత్రి కెసిఆర్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించగా సిస్టం వద్ద ఉప్పొంగిన కృష్ణా జలాలను చూసిన ప్రజలు జేజేలు కొట్టారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నార్లాపూర్ వద్ద 4 గంటల 22 నిమిషాలకు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజల అనంతరం స్విచ్ నొక్కి మొదటి మోటార్‌ను ప్రారంభించారు. తదనంతరం నార్లాపూర్ రిజర్వాయర్ వద్ద సిస్ట ర్న్ వద్ద ఉప్పొంగుతున్న కృష్ణా జలాలను తిలకించి ముఖ్యమంత్రి కెసిఆర్ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి పూలను సమర్పించారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఉన్నారు. నార్లాపూర్ నుంచి సాయంత్రం కొల్లాపూర్ లో నిర్వహించిన బహిరంగ సభకు తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక, సాంస్కృ తి శాఖ మంత్రి ఎ. శ్రీనివాస్‌గౌడ్, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, బిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ ప్లోర్ లీడర్ కేశవరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంత కుమారి, నీటి పారుదల శాఖ కార్యదర్శి రజత్ కుమా ర్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్, ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్ రెడ్డి, ప్రభుత్వ విప్ గు వ్వల బాలరాజు, ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, జైపాల్ యాదవ్, లకా్ష్మరెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, డా. విఎం అబ్రహం, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, ఎస్. రాజేందర్ రె డ్డి, ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, నాగర్‌కర్నూల్ జి ల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్, నాగర్‌కర్నూల్ ఎంపి పో తుగంటి రాములు, మహబూబ్‌నగర్ ఎంపి మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బాల్క సుమన్, నా గర్‌కర్నూల్ జెడ్పి చైర్మెన్ శాంతి కుమారి, పొల్యుషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరి, అదనపు కలెకర్లు కుమార్ దీపక్, డిసిసిబి డైరెక్టర్ జక్కా రఘునందన్.

పల్లెర్లు మొలిచిన పాలమూరులో పాల నురగల జలహేల : కెటిఆర్

మన తెలంగాణ / హైదరాబాద్ : తరతరాల ఎదురు చూపులు ఫలించే వేళ ..పల్లేర్లు మొలిచిన పాలమూరులో .. పాలనురగల జలహేల! అని కెటిఆర్ అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో కవిత రూపంలో ట్వీట్ చేశారు. వలసల వలపోతల గడ్డపైన ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం ఆవిష్కృతం! అయ్యిందని, కరు వు కరాళ నృత్యం చేసిన భూముల్లో, కృష్ణమ్మ జల తాండవం! చేసిందని అన్నారు. శెలిమలే దిక్కైన కాడ ఉద్దండ జలాశయాలు..!, బాయిమీద పంపుసెట్లు నడవని చోట బాహుబలి మోటర్లు ..!, స్వరాష్ట్ర ప్రస్థానంలో సగర్వ సాగునీటి సన్నివేశం..! ఆరు జిల్లాలు సస్యశ్యామ లం, దక్షిణ తెలంగాణకు దర్జాగా జలాభిషేకం! అని అన్నారు. నిన్న..పరాయి నేలపైన ప్రాజెక్టులకు రాళ్ళెత్తిన పాలమూరు లేబర్ ! నేడు..సొంత భూమిలో ప్రాజెక్టుల కింద రతనాలు పండిస్తున్న ఫార్మర్..! నాడు ..నది పక్కన నేల ఎడారిలా ..ఎండిన విషాదం ! సమైక్య పాలకుల పాపం.. కాంగ్రెసోళ్ల శాపం! బిర బిరా తరలి వెళ్తున్న కృష్ణమ్మను బీడు భూములకు రప్పించేందుకు స్వయం పాలనలో సాహస యజ్ఞం! ఆటంకాలు అవరోధాలు అధిగమించి.. ప్రతి పక్షాల కుట్రలు కేసులు ఛేదించి సవాల్ చేసి సాధించిన విజయం! నీటి వాటా తేల్చకుండా నిర్లక్ష్యంఅనుమతుల్లో అంతులేని జాప్యం ఐనా.. కేంద్ర సర్కారు కక్షను వివక్షను దీక్షతో గెలిచిన దృఢ సంకల్పం! తీరిన దశాబ్దాల నీటి వెత , తెచ్చుకున్న తెలంగాణకు ఇదే సార్థకత..! అని కెటిఆర్ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News