Wednesday, March 29, 2023

బొమ్మల రామారం పిఎస్‌పై నక్సలైట్ల దాడి.. ప్రాణాలకు తెగించి పోరాడిన మెయిన్ సెంట్రీకి సన్మానం

- Advertisement -

మనతెలంగాణ, హైదరాబాద్ : బొమ్మలరామారం పోలీస్ స్టేషన్‌పై నక్సల్స్ దాడిని ఎదురించిన సెంట్రీని రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ అభినందించారు. నేరెడ్‌మెట్‌లోని తన కార్యాలయానికి పిలిపించుకుని శుక్రవారం అభినందించారు. ప్రస్తుతం నల్గొండ జిల్లాలో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న అప్పటి మెయిన్ సెంట్రీ కానిస్టేబుల్ గుత్త వెంకట్‌రెడ్డిని అభినందించారు. 1999లో ప్రస్తుత రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ నల్గొండ జిల్లా ఎఎస్పిగా పనిచేస్తున్నారు. ఆ సమయంలోనే బొమ్మలరామరం పోలీస్ స్టేషన్‌పై సాయుధులైన 40మంది నక్సలైట్లు 1999, జనవరి 30వ తేదీన దాడి చేశారు.

దాడి చేసే సమయంలో పోలీస్ స్టేషన్‌లో ఏడుగురు పోలీస్ సిబ్బంది మాత్రమే విధుల్లో ఉన్నారు. మెయిన్ సెంట్రీగా కానిస్టేబుల్ గుత్త వెంకట్‌రెడ్డి ఉన్నారు. అందరు కలిసి నక్సల్స్‌ను ఎదుర్కొన్నారు, వెంకట్‌రెడ్డి కాలులో బుల్లెట్ దిగినా కూడా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో పోలీసులు గాయపడగా, ఇద్దరు నక్సల్స్ ప్రాణాలు కోల్పోయారు. ఎప్పుడు ఏ ఆపద ఉన్న తనను సంప్రదించాలని సిపి చౌహాన్ కోరారు. కుటుంబం గురించి అడిగి తెలుసుకున్నారు. వెంకట్‌రెడ్డి కూతురు సివిల్స్‌కు ప్రిపేరవుతున్న విషయం తెలుసుకున్న సిపి డిఎస్ చౌహాన్ అవసరమైన గైడెన్స్, ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News