- Advertisement -
పురపాలక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కెటిఆర్ చేసినన్ని తప్పులు ఎవరూ చేయలేదని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు దుయ్యబట్టారు. ఎన్ కన్వెన్షన్‌ను కూలగొట్టాలని హైకోర్టు 2014లోనే ఉత్తర్వులిచ్చిందని, కానీ, పదేళ్లు అధికారంలో ఉన్న భారాస కూలగొట్టలేదని అన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చెరువులు ఎక్కడెక్కడ కబ్జా చేశారో పదేళ్లు అధికారంలో ఉన్న కేటీఆర్‌కు తెలియదా? అని ప్రశ్నించారు. భారాస, కాంగ్రెస్ నేతలు పరస్పరం తిట్టుకుంటూ కాలం గడుపుతున్నారని విమర్శించారు.
- Advertisement -