Friday, April 19, 2024

లాల్ చౌక్‌లో జాతీయ జెండా ఎగురవేసిన రాహుల్

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్ : రాహుల్ గాంధీ (Rahul Gandhi) సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ చేపట్టిన ’భారత్ జోడో యాత్ర’ (Bharat Jodo Yatra) చివరి మజిలీగా శ్రీనగర్‌లో ఆదివారం కొనసాగుతోంది. ప్రఖ్యాత లాల్ చౌక్ (Lal Chowk)లో జాతీయ జెండాను (Natioanal Flag) రాహుల్ గాంధీ ఎగురవేశారు. సోనావార్‌లో 30 నిమిషాల పాటు బ్రేక్ తీసుకున్నప్పుడు మౌలానా ఆజాద్ రోడ్డులోని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయానికి రాహుల్ వెళ్లారని, అక్కడ నుంచి ’ఘంటా ఘర్’గా అత్యంత ప్రాచుర్యం ఉన్న క్లాక్ టవర్ చేరుకుని జాతీయ జెండా ఎగురవేశారని పార్టీ వర్గాలు తెలిపాయి.

లాల్ చౌక్ వద్ద త్రివర్ణ పతాకం ఎగురవేసిన కార్యక్రమంలో రాహుల్ వెంట ఆయన సోదరి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, జమ్మూకశ్మీర్ కాంగ్రెస్ నేతలు ఉన్నారు. 10 నిమిషాల పాటు ఈ కార్యక్రమం జరగగా, భద్రతా కారణాల దష్ట్యా లాల్ చౌక్‌కు దారితీసే అన్ని రోడ్లను సీల్ చేశారు. వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ముందస్తుగా దుకాణాలు, వాణిజ్య సంస్థలు, వారాంతపు మార్కెట్‌లు మూతపడ్డాయి. సెక్యూరిటీ డ్రిల్ సైతం నిర్వహించారు.

కాంగ్రెస్ జోడో యాత్ర ముగింపు సభకు 12 పార్టీల నేతలు

కాంగ్రెస జోడో యాత్ర ఆదివారం ముగిసింది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 2022 సెప్టెంబర్ 7 నుంచి 2023 జనవరి 29 వరకు దాదాపు 150 రోజుల పాటు రాహుల్ యాత్ర కొనసాగింది. జనవరి 30 సోమవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో శ్రీనగర్‌లో యాత్ర ముగింపు భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ ముగింపు సభకు 12 ప్రతిపక్ష పార్టీలు హాజరు కానున్నాయని ఆయా వర్గాలు తెలిపాయి. సభకు హాజరు కావాలని 21 పార్టీలను ఆహ్వానించగా, కొందరు భద్రతా కారణాల దృష్టా హాజరు కావడం లేదని చెప్పారు.

హాజరు కాని పార్టీల్లో తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ, తెలుగుదేశం ఉన్నాయి. స్టాలిన్ సారధ్యంలోని డిఎంకె, శరద్‌పవార్ నాయకత్వ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, తేజస్వియాదవ్ నేతృత్వం లోని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జెడీ) నితీష్‌కుమార్ జనతాదళ్, ఉద్ధవ్ థాక్రే శివసేన, సిపిఎం, సిపిఐ, విడుతలై చిరుతైగల్ కట్చి ( విసికె) కేరళ కాంగ్రెస్; ఫరూక్ అబ్దుల్లా నేషనల్ కాన్ఫరెన్సు, మెహబూబా ముఫ్తీ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ, శిబు సోరేన్ ఝార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీలు హాజరవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News