Wednesday, September 18, 2024

తెలంగాణలోకి ప్రవేశించిన రాహుల్ గాంధీ జోడో యాత్ర..

- Advertisement -
- Advertisement -

 Rahul Gandhi Jodo Yatra enters into Telangana

హైదరాబాద్: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించింది. ఆదివారం ఉదయం రాష్ట్రంలోకి అడుగుపెట్టిన రాహుల్ గాంధీకి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాణిక్కం ఠాగూర్, పలువురు నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా డికె శివకుమార్ నుంచి రేవంత్ రెడ్డి జాతీయ జెండాను తీసుకున్నారు. తెలంగాణలో 12 రోజుల పాటు మొత్తం 370 కి.మీ రాహుల్ పాదయాత్ర కొనసాగనుంది. అయితే, దీపావళి కారణంగా ఈ నెల 24, 25, 26 తేదీల్లో రాహుల్ గాంధీ పాదయాత్రకు విరామం ఇవ్వనున్నారు. మూడు రోజుల విరామం అనంతరం 27వ తేదీ నుంచి తిరిగి యాత్రను రాహుల్ ప్రారంభించనున్నారు.

 Rahul Gandhi Jodo Yatra enters into Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News