Thursday, January 16, 2025

జగిత్యాలకు రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: కాంగ్రెస్ విజయభేరీ యాత్రలో భాగంగా జగిత్యాల జిల్లాకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత  రాహుల్ గాంధీ కాసేపట్లో చేరుకోనున్నారు. కరీంనగర్ నుండి ఇప్పుడే తన వాహన శ్రేణిలో రాహుల్ బయలు దేరారు. కరీంనగర్ జిల్లా గంగాధర చౌరస్తాలో రాహుల్ గాంధీ కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కార్యదర్శులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సమయానుగుణంగా  జగిత్యాలకు ముఖ్య ప్రచారకర్తలుగా విచ్చేస్తున్నారు. ధరూర్ కెనాల్ నుండి బైక్ ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్ కార్యకర్తలు వారికి ఘన స్వాగతం తెలిపారు. జగిత్యాల పట్టణ కొత్త బస్టాండ్ కూడలిలో ఉదయం 11.30 గంటలకు బహిరంగ సభ జరగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News