Saturday, September 21, 2024

పార్లమెంటరీ దర్యాప్తుపై మోడీకి భయం: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

సెబీచైర్‌పర్సన్ మాధబీ బచ్‌పై యుఎస్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసర్చ్ తాజాగా చేసిన ఆరోపణలపై లోక్‌సభలోని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆదివారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సెక్యూరిటీల క్రమబద్ధీకరణ సంస్థ చిత్తశుద్ధి ‘బాగా దెబ్బ తిన్నది’ అని ఆయన ఆరోపించారు. ఆరోపణలపై జెపిసి దర్యాప్తునకు ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు భయపడుతున్నారో ఆ సంస్థ ఇటీవలి నివేదిక తేటతెల్లం చేస్తున్నదని రాహుల్ అన్నారు. అదానీ గ్రూప్‌నకు సంబంధించిన ఆఫ్‌షోర్ నిధుల్లో సెబీ చీఫ్ మాధబీ బచ్‌కు వాటాలు ఉన్నందున ఆ గ్రూప్‌పై చర్యకు సెబీ వెనుకాడుతున్నదని తాము అనుమానిస్తున్నామని పేర్కొంటూ హిండెన్‌బర్గ్ రీసర్చ్ శనివారం రాత్రి తాజా నివేదిక విడుదల చేసింది.

చిన్న రిటైల్ మదుపరుల సంపదను పరిరక్షించే బాధ్యత గల సెబీ చిత్తశుద్ధి దాని చైర్‌పర్సన్‌పై ఆరోపణలతో తీవ్రంగా దెబ్బ తిన్నది’ అని రాహుల్ ‘ఎక్స్’లో వీడియో సందేశంలో పేర్కొన్నారు. సెబీ చైర్‌పర్సన్ ఇంకా ఎందుకు రాజీనామా చేయలేదో దేశంలోని మదుపరులు తెలుసుకోవాలని అనుకుంటున్నారని కూడా ఆయన అన్నారు. మదుపరులు తమ కష్టార్జితాన్ని నష్టపోతే ఎవరు జవాబుదారీ అవుతారు & ప్రధాని మోడీయా లేక సెబీ చైర్‌పర్సనా లేక గౌతమ్ అదానీనా? అని రాహుల్ అడిగారు. కొత్తగా, అత్యంత తీవ్రమైన ఆరోపణలు వెలుగు చూసిన దృష్టా సుప్రీం కోర్టు మళ్లీ ఈ వ్యవహారాన్ని సు మోటోగా పరిశీలిస్తుందా అని కూడా రాహుల్ ప్రశ్నించారు. జెపిసి దర్యాప్తు గురించి, అది బహిర్గతం చేసే అంశాల గురించి ప్రధాని మోడీ ఎందుకు భయపడుతున్నారో ఇప్పుడు సుస్పష్టం అవుతోందని రాహుల్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News