Monday, April 29, 2024

ఇదేమి రామ రాజ్యం: రాహుల్ గాంధీ ఫైర్

- Advertisement -
- Advertisement -

కాన్పూర్/ఉన్నావ్: దేశ జనాభాలో 90 శాతం ఉన్న దళితులు, ఇతర వెనుకబడిన తరగతులకు ఉద్యోగాలను బిజెపి నేతృత్వంలోని కేంద్రం సృష్టించడం లేదని, మోడీ ‘రామ రాజ్యం’లో వారిపై వివక్ష సాగుతోందని కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ బుధవారం ఆరోపించారు. ‘ఇది ఏమి రామ రాజ్యం? మొత్తం జనాభాలో దాదాపు 90 శాతం ఉన్న వెనుకబడిన తరగతులు (బిసిలు), దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు ఉద్యోగాలకు ఉద్యోగాలు దక్కవు’ అని రాహుల్ ఆక్షేపించారు.

తన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో భాగంగా బుధవారం కాన్పూర్‌లోని ఘంటాఘర్ కూడలిలో ఒక బహిరంగ సభలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ జనాభాలో 50 శాతం మంది బిసిలకు చెందినవారు, 15 శాతం మంది దళితులు, 8 శాతం మంది ఆదివాసీలు, 15 శాతం మంది మైనారిటీలు.. మీరు కోరుకున్న స్థాయిలో కేకలు వేయండి.

కానీ ఈ దేశంలో మీకు ఉద్యోగాలు దొరకవు. మీరు వెనుకబడిన, దళిత, ఆదివాసీ లేక పేద సార్వత్రిక కేటగరీకి చెందినవారైతే మీకు ఉద్యోగం లభించదు. మీకు ఉద్యోగాలు రావడం నరేంద్ర మోడీకి ఇష్టం లేదని రాహుల్ అన్నారు. భారత్‌లో వర్గ, కుల అంతరాలు ఏవిధంగా ఉన్నాయంటే దళితులకు, బిసిలకు మీడియాలో గాని, బడా పరిశ్రమలలో గాని, అధికార యంత్రాంగంలో గానీ వారికి ప్రాతినిధ్యం వహించేందుకు ఎవ్వరూ లేరని ఆయన చెప్పారు. దేశంలో జనం ఆకలితో మరణిస్తున్నారని రాహుల్ ఆరోపించారు. మీరు ప్రాణ ప్రతిష్ఠ వేడుక చూశారు. బిసిల నుంచి ఎందరు ఉన్నారు? దళితులు, ఆదివాసీల నుంచి ఎందరు ఉన్నారు? ఆదివాసీ రాష్ట్రపతి (ద్రౌపది ముర్ము)ను కూడా ఆహ్వానించలేదు.

దళిత మాజీ రాష్ట్రపతి (రామ్‌నాథ్ కోవింద్)ను ఆలయంలోకి అనుమతించలేదని రాహుల్ ఆరోపించారు. కుల గణన కోసం తమ పార్టీ, మిత్ర పక్షాల డిమాండ్ గురించి రాహుల్ నొక్కిచెబుతూ, అటువంటి సర్వే మాత్రమే దేశంలో వెనుకబడిన తరగతుల సంక్షేమం గురించి, వారి వద్ద ఎంత డబ్బు ఉన్నది తెలుసుకోవడానికి దోహదం చేస్తుందని సూచించారు. ‘భారత పురోగతికి అత్యంత పెద్ద విప్లవాత్మక చర్య కులగణనే అని మేము చెప్పాం’ అని రాహుల్ తెలిపారు. 2016 పెద్ద నోట్ల చలామణీ రద్దు, జిఎస్‌టి, అగ్నివీర్ పథకంతో సహా పలు నిర్ణయాలకు కేంద్ర ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News