Tuesday, June 18, 2024

ప్రతి మహిళకు ఏడాదికి రూ.లక్ష ఆర్థిక సాయం: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

మహిళలు ఆర్థికంగా బలపడితే దేశ ముఖచిత్రమే మారుతుందని.. అందుకే కాంగ్రెస్ పార్టీ మహిళల సంక్షేమానికి పెద్దపీట వేసిందని రాహుల్ గాంధీ అన్నారు. శనివారం సాయంత్రం తుక్కుగూడలో నిర్వహించిన జనజాతర సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొని జాతీయస్థాయి మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొద్ది నెలల క్రితం ఇక్కడే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ గ్యారంటీలను ప్రకటించామని.. ఇప్పుడు జాతీయస్థాయి గ్యారంటీలను ప్రకటించేందుకు వచ్చానన్నారు.

రాష్ట్రంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం. దేశంలోనూ ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని చెప్పారు. మహిళలకు న్యాయ్ పేరుతో దేశంలో ప్రతి నిరుపేద కుటుంబంలోని మహిళకు ఏడాదికి లక్ష రూపాయలు ఇస్తామని తెలిపారు. నేరుగా మహిళా బ్యాంకు అకౌంట్ లో డబ్బులు జమా చేస్తామని చెప్పారు. దేశంలోని యువతకు ఏడాదికి రూ.లక్ష వేతనం వచ్చేలా ఉపాధి కల్పిస్తామన్నారు. యువతకు నెలకు రూ.8,500తో సంవత్సరం పాటు శిక్షణ ఇస్తామని రాహుల్ గాంధీ హామి ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News