Saturday, September 30, 2023

ప్రతిపక్షాలన్నీ ఏకమైతే బిజెపి ఓడిపోతుంది

- Advertisement -
- Advertisement -

ప్రతిపక్షాలన్నీ సరిగ్గా ఏకమయితే బిజెపి కచ్చితంగా ఓడిపోతుందని, కర్నాటక ఎన్నికలే ఇందుకు ఉదాహరణ అని రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వారం రోజుల అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాంటాక్లారాలో మంగళవారం ప్రవాస భారతీయులు ‘మొహబ్బత్ కీ దుకాన్’ పేరిట ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘విపక్షాల ఐక్యత కోసం మేము ప్రయత్నిస్తున్నాం. అయితే కేవలం ఐక్యత మాత్రమే సరిపోదు. ప్రత్యామ్నాయ వ్యూహం కూడా అవసరం అని రాహుల్ ఈ సందర్భంగా అన్నారు.ఇక ప్రపంచ మీడియాలో చూపించినట్లుగా భారత్‌లో పరిస్థితులు లేవని రాహుల్ ఆరోపించారు. అదంతా రాజకీయ ప్రచారమేనని కేంద్రప్రభుత్వంపై ధ్వజమెత్తారు. వాస్తవంలో అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి’ అని అన్నారు.

ఖలిస్థాన్ వాదుల నినాదాలు
రాహుల్ ప్రసంగిస్తుండగా సభలో కూర్చుని ఉన్న కొందరు ఖలిస్థానీ మద్దతుదారులు హల్‌చల్ చేశారు. రాహుల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన ప్రసంగాన్ని అడ్డుకోవడానికి యత్నించారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లను ప్రస్తావిస్తూ రాహుల్, ఆయన కుటుంబానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే ఈ నినాదాలపై రాహుల్ స్పందిస్తూ ‘ విద్వేష మార్కెట్లో ప్రేమ దుకాణాలు’ అంటూ చిరునవ్వుతో సమాధానమిచ్చారు. దీంతో సభలోఉన్న కాంగ్రెస్ మద్దతుదారులు భారత్ జోడో అంటూ ప్రతి నినాదాలు చేశారు. ఈ లోగా పోలీసులు అక్కడికి చేరుకుని నినాదాలు చేస్తున్న వారిని బయటికి పంపించారు. కాగా వారం రోజుల పర్యటన కోసం రాహుల్ గాంధీ మంగళవారం న్యూయార్క్ చేరుకున్నారు. ఆయన వాషింగ్టన్, న్యూయార్క్ నగరాల్లో పర్యటించనున్నారు.అక్కడి ప్రవాస బారతీయులతో ముచ్చటించనున్నారు.అమెరికా చట్లసభ ప్రతినిధులు, ఇతర రంగాల ప్రముఖులతో చర్చలు జరపనున్నారు. జూన్ 4న న్యూయార్క్‌లోని మాడిసన్ స్కేర్ గార్డెన్‌లో ఏర్పాటు చేసే బహిరంగ సభలు ప్రసంగిస్తారని కాంగ్రెస్ తెలిపింది.

నియోజకవర్గాల పునర్విభజనపై అనుమానాలు
దేశ ప్రాతినిధ్య వ్యవస్థలో మార్పులు చేపట్టేటప్పుడు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. కొత్త పార్లమెంటు భవనాన్ని 800 మందికి పైగా సభ్యులు కూర్చునేందుకు వీలుగా నిర్మించడంలో ఔచిత్యాన్ని ్న ఆయన ప్రశ్నిస్తూ, నియోజకవర్గాల పునర్విభజనను చేపట్టేటప్పుడు సమగ్రమైన విధానాన్ని పాటించాల్సిన అవసరం ఉందన్నారు. కాగా కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడం ప్రజలు ఎదుర్కొంటున్న అసలైన సమస్యలనుంచి దృష్టి మళ్లించడం కోసమేనని రాహుల్ విమర్శించారు. జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్య దామాషాను నిర్ణయించడంలో ఔచిత్యాన్ని ఆయన ప్రశ్నించారు. అన్ని రాష్ట్రాలు, వర్గాలు తమకు సరయిన ప్రాతినిధ్యం లభించిందని భావించాలని, ఎందుకంటే దేశంలో అనేక భాషలు, కులాలు, మతాలకు చెందిన వారున్నారని ఆయన అన్నారు. మైనార్టీలు, ముఖ్యంగా ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి రాహుల్ తన ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించారు. మైనారిటీ వర్గాలపై దాడులు, అణచివేత కొనసాగుతోందని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News