- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ లో భారీ వర్షం నేపథ్యంలో అధికారులను అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రకటనలో ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ), హైదరాబాద్ మెట్రో డవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఏ), జలమండలి , విద్యుత్, పోలీస్ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సీఎం సూచించారు. అలాగే ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్, హైడ్రా బృందాలు, ఇతర విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కూడా సీఎం ఆదేశించారు. వర్షంతో ఇబ్బందులు పడుతున్న ప్రాంతాల్లో ప్రజలు పిర్యాదు చేసిన వెంటనే స్పందించి సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
- Advertisement -