Home తాజా వార్తలు తెలంగాణలో మోస్తరు వర్షాలు

తెలంగాణలో మోస్తరు వర్షాలు

Rain-Fallహైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా చిరు జల్లులు కురుస్తున్నాయి. కరీంనగర్‌లో రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఒసిపి 1,2,3,4 ఓపెన్ కాస్ట్‌ల్లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో రామగుండంలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఆదిలాబాద్ జిల్లాలోని దండేపల్లి, జైపూర్, మంచిర్యాల, చెన్నూర్, వేమనపల్లి, తాండూరు తదితర ప్రాంతాలలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఖమ్మం జిల్లాలోని ఇల్లందు మణుగూరు, నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ, కనగల్లు, పోచంపల్లి, యాదాద్రిలో చిరు జల్లులు కురుస్తున్నాయి.