Monday, November 11, 2024

ఎపిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు..!

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అప్రమత్తమైన అధికారులు 5 జిల్లాల్లోని విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు.

ముఖ్యంగా తిరుపతిలో కుండపోత వర్షం కురుస్తోంది. కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య జిల్లాలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే చాన్స్ ఉందని చెప్పింది. దీంతో పలు జిల్లాల్లో ప్రభుత్వం కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటు చేసింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని అధికారులు హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News