Saturday, August 16, 2025

స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచివారిని ఎన్నుకోండి: రాజగోపాల్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  రాష్ట్ర అభివృద్ధి పనులకు ఒక్క రూపాయి నిధులు కూడా రావడం లేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) తెలిపారు. పదవులు వారికే.. పైసలు వారికే అని కొద్ది రోజుల క్రితం అన్నానని చెప్పారు. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఎల్లగిరి గ్రామంలో రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..తనకు పదవి ఇవ్వలేదని, కనీసం నిధులైనా మంజూరు (Grant funds) చేయండని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచివారిని ఎన్నుకోవాలని సూచించారు. పదవి వచ్చేటప్పుడు వస్తుంది దానిని ఎవరూ ఆపలేరని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News