Sunday, April 28, 2024

నకిలీ అల్లం తయారీ కేంద్రంపై దాడి

- Advertisement -
- Advertisement -

నకిలీ అల్లం తయారు చేస్తున్న యూనిట్‌పై రాజేంద్రనగర్ ఎస్‌ఓటి పోలీసులు శనివారం దాడి చేశారు. నకిలీ అల్లం తయారు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 3,500 కిలోల నకిలీ అల్లం, సంచుల్లో 500 కేజీల ముడి వెల్లుల్లి మెటీరియల్, 2 గ్రైండింగ్ మెషీన్లు, సోడియం బెంజోయేట్ వదులుగా ఉండే రసాయన పొడి, గమ్ పౌడర్, రంగు కోసం పసుపు పొడి, స్టిక్కర్లతో వదులుగా ప్యాకింగ్ పెట్టెలు, స్టిక్కర్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…చార్మినార్‌కు చెందిన మొహమ్మద్ అహ్మద్ కాటేదాన్ పారశ్రామిక ప్రాంతంలో నకిలీ అల్లం తయారు చేస్తున్నారనే సమాచారం ఎస్‌ఓటి పోలీసులకు వచ్చింది. వెంటనే దాడి చేసిన పోలీసులు సింథటిక్ కెమికల్స్ వేసి, అపరిశుభ్రమైన పరిస్థితుల్లో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను తయారు చేస్తున్నట్లు గుర్తించారు.

ఇక్కడి తయారీ యూనిట్ కోసం తీసుకున్న లైసెన్స్ రెండేళ్ల క్రితమే ముగిసినా నిందితులు నకిలీ అల్లం తయారు చేస్తున్నారు. సింథటిక్ కెమికల్స్, గమ్ పౌడర్, సోడియం బెంజోయేట్ (నెఫ్రోటాక్సిక్ పదార్థం), మృదుత్వం కోసం కెమికల్ పౌడర్, చెడిపోయిన వెల్లుల్లి తొక్కలు వేసి నకిలీ అల్లం తయారు చేస్తున్నారు. ఇక్కడ తయారు చేసిన నకిలీ అల్లం పేస్టును రోషన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మాస్ డైమండ్, స్వచ్ఛమైన అల్లం పేరుతో స్థానిక మార్కెట్లలో సరఫరా చేస్తున్నారు. నిందితుడిని అరెస్టు చేసిన ఎస్‌ఓటి పోలీసులు కేసు దర్యాప్తు కోసం మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు అప్పగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News