Friday, March 29, 2024

జరిగిందే చెప్పాను.. క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదు

- Advertisement -
- Advertisement -

Rajini

చెన్నై: ద్రవిడ ఉద్యమ పితామహుడిగా భావించే పెరియార్ ఇవి రామసామిపై తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదని సూపర్‌స్టార్ రజనీకాంత్ స్పష్టం చేశారు. మంగళవారం నాడిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను చెప్పిన విషయాలలో అబద్ధాలేవీ లేవని, అవన్నీ అప్పట్లో పత్రికల్లో వచ్చినవేనని చెప్పారు. ఆ పత్రికల కథనాలను చూపించడానికి తాను సిద్ధమని, క్షమాపణ మాత్రం చెప్పే ప్రసక్తి లేదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా 1971 నాటి వార్తా పత్రికల క్లిప్పింగ్‌లను ఆయన విలేకరులకు చూపించారు. 1971లో పెరియార్ ఒక ర్యాలీని నిర్వహించారు. ఆ ర్యాలీలో శ్రీరాముడు, సీతాదేవి విగ్రహాలను దుస్తులు లేకుండా మెడలో చెప్పుల దండలు వేసి ఊరేగించారు.

తాను జరగని విషయాన్ని చెప్పినట్లు ఏదో వివాదం సృష్టిస్తున్నారని, తాను జరిగిన సంఘటనే చెప్పానని, పత్రికల్లో రాసిన వార్తలనే చెప్పానని రజనీకాంత్ అన్నారు. పెరియార్ చర్యకు నిరసనగా 1971లో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న అప్పటి జనసంఘ్, ఇప్పటి బిజెపి నాయకుడు లక్ష్మణన్ కూడా తన మాటలను ధృవీకరించారని రజనీ సష్టం చేశారు. ఈ నెల మొదట్లో చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న రజనీకాంత్ ద్రవిడ పార్టీలు ఆరాధ్యదైవంగా భావించే పెరియార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. పెరియార్‌ను హిందూ దేవుళ్ల వ్యతిరేకిగా ఆయన అభివర్ణించారు.

1971లో సేలంలో శ్రీరామచంద్రమూర్తి, సీతాదేవి విగ్రహాలను చెప్పుల దండలతో నగ్నంగా పెరియార్ ఊరేగించారని రజనీ చెప్పారు. అప్పట్లో పెరియార్‌ను ఎవరూ విమర్శించలేదని ఆయన అన్నారు. కాగా, రజనీకాంత్ పెరియార్‌పై అవాస్తవాలు చెబుతున్నారని, ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండు చేస్తూ ద్రవిడర్ విడుదలై కళగం అనే ద్రవిడ పార్టీ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

Rajinikanth refuses to apologise, Rajini says I didnt say anything out of imagination on Periyar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News